గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి 2019 మే 30 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అంటూ ఏపీలో కొత్త కొత్త సంస్కరణలు చేపట్టి గత ఐదేళ్లుగా సక్సెస్ఫుల్ గా ఏపీకి సీఎం గా పని చేసిన జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అని చాలా కాన్ఫిడెంట్ తో కనిపిస్తున్నారు.
తాను ప్రజలకి చేసిన మంచే తనని మరోసారి సీఎం ని చేస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 13 ఎన్నికలు పూర్తి కాగానే జగన్ మోహన్ రెడ్డి భార్య పిల్లలతో కలిసి మే 17 న లండన్ వెళ్లి రేపు అంటే జూన్ 1 శనివారం తిరిగి హైదరాబాద్ కి రాబోతున్నారు. జూన్ 4 ఫలితాలు తమకి అనుకూలంగా వస్తాయని ఆయన చాలా నమ్మకంతో ఉన్నారు.
తాజాగా జగన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి.. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవడం అటుంచి జగన్ కాన్ఫిడెన్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం తద్యమంటూ వైసీపీ కేడర్ పండగ చేసుకుంటుంది.