నందమూరి బాలకృష్ణ పై నిన్న బుధవారం సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మాములుగా లేదు. బాలయ్య మ్యాన్షన్ హౌస్ తాగొచ్చి మరీ హీరోయిన్ ని నెట్టేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టేజ్ పై అంజలిని జరగమంటూనే బాలయ్య ఉన్నట్టుండి అంజలిని పక్కకి తోసెయ్యగా ఆమె పడిపోబోయి మరో హీరోయిన్ నేహా శెట్టిని పట్టుకుని తమాయించుకున్న వీడియోస్ వైరల్ అయ్యాయి.
అంతేకాదు బాలయ్య కూర్చున్న చోట వాటర్ బాటిల్ లో మద్యం ఉన్నట్టుగా వీడియోస్ ని స్ప్రెడ్ చేసారు. దానితో బాలయ్య బీర్ బాటిల్- హీరోయిన్ అంటూ ఏవేవో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వైసీపీ వాళ్ళు నానా హంగామా చేసారు. మరి బాలయ్య తాగొచ్చి హీరోయిన్స్ తో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ రాసారు.
తాజాగా బాలయ్య పై జరుగుతున్న ట్రోలింగ్ పై ఈరోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రెస్ మీట్ లో విశ్వక్ సేన్ మరియు నిర్మాత నాగ వంశి క్లారిటీ ఇచ్చారు. బాలయ్య పక్కన ఉన్న బాటిల్ లో ఉన్నది మద్యం కాదు జ్యుస్ అంటూ విశ్వక్ చెప్పగా.. నాగ వంశీ మాత్రం అదంతా ఎవరో కావాలని క్రియేట్ చేసారు. బాలయ్య పక్కన సీ.జి చేసి ఆ బాటిల్ అక్కడ పెట్టేలా చేసారంటూ చెప్పుకొచ్చారు.
దానితో బాలయ్యా అది నిజంగానే జ్యుసా లేదంటే సి జి నా అంటూ నెటిజెన్స్ సరదాగా, వెటకారంగా కామెంట్ చేస్తున్నారు.