Advertisement

కీరవాణి వద్దు.. బీర్లు మాత్రం ముద్దా..!!


అవును.. ఈ రెండూ వేర్వేరు టాపిక్స్. కానీ ఇప్పుడివే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర చిహ్నం, గీతంను మార్చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు. ఈ రెండూ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సీఎంగా కేసీఆర్ ఎన్నో సంస్కరణలు చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో చరిత పుటల్లోకి కూడా ఎక్కాయ్. ఐతే ఆ ముద్రలు అన్నీ చేరిపేయాలని అనుకున్నారో.. లేకుంటే అవన్నీ సరిగ్గా లేవనో మార్పులు, చేర్పులు చేసే పనిలో పడింది కాంగ్రెస్ సర్కార్.

Advertisement

ఏం జరుగుతోంది..?

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పక్కనెట్టి.. జయ జయహే తెలంగాణ అని అందె శ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చే పనిలో పడ్డారు రేవంత్. దీనికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐతే ఇందుకు సంగీత దిగ్గజం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జూన్ ఒకటో తారీఖు లోపు పాటను పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే అసలు కీరవాణి ఎవరు..? ఆయనకు తెలంగాణకు సంబంధం ఏంటి..? రాష్ట్రంలో ఎవరూ సంగీత దర్శకులు లేరా..? అని ఎవరు చూసినా ఒక రేంజిలో తిట్టిపోశారు. ఆఖరికి కులం పేరెత్తి కూడా తిట్టారు అంటే ఎంత హద్దూ పద్దూ లేకుండా ఉన్నారో విమర్శకులు అర్థం చేసుకోవచ్చు. 

ఒక రాష్ట్ర గీతానికి సంగీతం ఇవ్వడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కీరవాణిని ఎంచుకున్నారంటేనే ఆయన సరిగ్గా సెట్ అవుతారని కదా..!. ఇప్పుడీ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకున్నది.

ఇంత విషమా..?

కీరవాణి ఆంధ్రా మనిషి కదా వద్దు సరే.. మిగిలిన అన్ని విషయాల్లోనూ ఇలాగే వేరే రాష్ట్రాలకు సంబంధించి ఏదీ ఉండకూడదు కదా.. మరి ఎందుకు తెలంగాణ ప్రజలు, కుహనా మేధావులు.. విమర్శకులు కొన్నిటిని సమర్థిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇదిగో.. తెలంగాణలో కొద్ది రోజులుగా పేరుగాంచిన, మద్యం ప్రియులకు బాగా నచ్చిన కొన్ని కంపెనీలకు చెందిన బీర్లు అస్సలు కనిపించట్లేదు.. దొరకట్లేదు. దీని వెనుక ఏం జరిగింది అనేది అప్రస్తుతం. ఐతే విదేశీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలకు చెందిన బీర్లను మాత్రం అంగీకరించడం ఎంతవరకూ సమంజసం. దీనికి ఓకే చెప్పిన సభ్యసమాజం కీరవాణి విషయంలో ఎందుకు ఇంతలా విషం కక్కిందో మరి. పోనీ ఇదొక్కటే కాదు నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకూ ఇదే విమర్శకులు ఏమేం చేస్తున్నారో అవన్నీ తెలంగాణకు సంబంధం ఉన్నవాళ్లు చేస్తేనే తిండి తింటున్నారా..? పోనీ హోటల్ వెళ్ళాక ఇది ఆంధ్రా వాళ్ళు చేశారా.. లేకుంటే తెలంగాణ వాళ్ళు చేశారా..? అని అడిగి తింటున్నారా..? ఎన్ని రంగాల్లో, ఎన్నెన్ని కంపెనీలను ఆంధ్రా వాళ్ళు నడుపుతున్నారనేది తెలుసుకుంటే మంచిది మరి. ఇవే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర, తెలంగాణ అని అన్నీ వేరు చేయాల్సి ఉంటుంది.

పొలిటికల్ మైలేజ్ కోసం ఇలా..!

కీరవాణి ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావొచ్చు.. కానీ భారతీయ సినిమా సంగీతానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సంగీత దిగ్గజం అనే విషయాన్ని మరిచిపోయి పైత్యం ప్రదర్శిస్తే ఎలా..?. అలాగనీ అందరూ అహంకారానికి పోవట్లేదు కానీ కొందరు మాత్రం బాబోయ్ వీళ్ళే రాష్ట్రాన్ని ఉద్ధరించిన వాళ్లు లాగా హడావుడి చేస్తున్నారు. కొందరు పనిగట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ వాడుకుని పొలిటికల్ మైలేజ్ కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక బీర్ల విషయానికి వస్తే.. సోమ్ డిస్టలరీస్ అనేది పంజాబ్ రాష్ట్రానికి చెందిన కంపెనీ కదా ఈ బీర్లే రేపటి నుంచి కొందరు తాగాల్సి వస్తుంది మరి వద్దనుకుంటారా..? లేకుంటే అంత పౌరుషం ఉంటే తెలంగాణాలో బీర్లు తయారు చేసుకొని తాగగలరా..? ఆంధ్రా.. అని విమర్శించే కుహనా మేధావులకే తెలియాలి మరి. అందుకే.. మనిషి ఎక్కడివాడు అనేది పక్కనెట్టి ఆయన చేయగలరా.. లేదా..? అంత కెపాజిటీ ఉందా లేదా అన్నది మాత్రమే చూడాలి. ఒక సినిమా పాటనే ఎంతో మనసు పెట్టి చేసి ఆస్కార్ వచ్చేలా చేశారంటే.. ఇక రాష్ట్ర గీతాన్ని తర తరాలుగా ఉండాల్సిన.. చరిత పుటల్లో ఉండాల్సిన గీతానికి ఎంత శ్రమను జోడించి చేయగలరు అనేది చూస్తే మంచిది మరి. ఇకనైనా ఆంధ్రా.. తెలంగాణ అనే విబేధాలు మరిచి.. సోదరభావంతో మెలిగితే మరీ మంచిది.. ఆలోచించుకోండి..!!

No Keeravani.. Beer is love..!!:

Telangana CM faces heat for roping in Oscar-winning Andhra music composer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement