గత పదేళ్లుగా ఈటీవీలో గురు, శుక్రవారాల్లో కామెడీ ప్రియులని అలరిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ని బుల్లితెర ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు. మొదట్లో ధనరాజ్, వేణు, శ్రీను, చంద్ర లాంటి వాళ్ళు టీమ్స్ గా ఏర్పడి కామెడీ చెయ్యగా.. ఆ తర్వాత కాలంలో సుధీర్, శ్రీను, ఆది లాంటి వాళ్ళు టీమ్స్ గా పోగయ్యి కామెడీ పండించారు.
జబర్దస్త్ వలన కామెడీ ప్రియులకి వారం వారం పండగే. అటు యాజమాన్యానికి బోలెడన్ని లాభాలు, ఇటు కమెడియన్స్ జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయ్యి ఇళ్ళు, కార్లు కొనుక్కుని రిచ్ గా సెటిల్ అవడమే కాదు, అటు ఫెము, ఇటు వెండితెర అవకాశాలతో వెలిగిపోతున్నారు. జబర్దస్త్ విపరీతంగా సక్సెస్ అవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ని మొదలు పెట్టారు. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చేవి.
జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మిక యాంకర్స్, అందులో నాలుగు టీమ్స్ ఇందులో నాలుగు టీమ్స్, రోజా, నాగబాబు జెడ్జెస్. కానీ ఈమధ్య కాలంలో జబర్దస్త్ ని నాగబాబు, రోజా, అనసూయ, సుధీర్, ఆది లాంటి వాళ్ళు వదిలేసారు. షో పై క్రేజ్ తగ్గిపోయింది. మెల్లగా జబర్దస్త్ కి ఆడియన్స్ దూరమవుతున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ ఆడియన్స్ కి బిగ్ షాకివ్వబోతున్నారు. ఇకపై గురు, శుక్రవారాల్లో జబర్ధస్త్ మాత్రమే ప్రసారం అవుతున్నట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్పారు.
ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ నుంచి ఎక్స్ట్రా ని తీసేస్తున్నట్టుగా ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా చేసి చూపించాడు. ప్రస్తుతం జబర్దస్త్ కి కృష్ణభగవాన్ ఇంద్రజల జెడ్జెస్ గా ఉండగా.. సిరి జబర్దస్త్ యాంకర్ గా చేస్తుంది. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉండగా ఖుష్బూ, కృష్ణభగవాన్ లు జెడ్జెస్ గా ఉన్నారు.
మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అంటూ రామ్ ప్రసాద్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా తీసేస్తున్నట్టుగా చెప్పగా.. కృష్ణభగవాన్, ఖుష్బూ, రష్మీ వాళ్ళు ఫీలైన ప్రోమో వైరల్ గా మారింది.