రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ.. ఏపీలో మాత్రం ప్రస్తుతం అంతా టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. రాజకీయనేతల్లో ఎన్నికల ఫలితాలపై టెన్షన్ ఉంటే పర్లేదు.. కానీ ప్రజలందరిలో ఉత్కంటతో పాటుగా టెన్షన్ కూడా కనిపిస్తుంది. జూన్ 4 న రాబోయే ఫలితాల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అందరూ తెగ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
పోటీ చేసిన వారు గెలుస్తామా అని టెన్షన్ పడుతుంటే.. ఒకరి మీద వకరు బెట్టింగ్స్ వేసుకున్న వారు.. తమ డబ్బులేమైపోతాయో.. బెట్టింగ్ లో గెలుస్తామో లేదో అని టెన్షన్ గా ఉన్నారు. ఇక మేము మాకు నచ్చినోళ్ళకి ఓటేసాము, కానీ అందరూ ఎవరికి ఓటేశారో.. ఈసారి ఎవరు గెలుస్తారో అని ప్రజలు టెన్షన్ పడుతున్నారు.
ఇక టీవీ ఛానల్స్ అయితే ఈ నియోజకవర్గంలో గెలుపెవరితో అంటూ టెన్షన్ పెంచేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ వారైతే ఈ నియోజక వర్గంలో వీరిదే గెలుపు అంటూ నొక్కివక్కాణిస్తున్నాయి. అటు జ్యోతిష్కులు కూడా ఏపీలో ఎవరు గెలుస్తారో జాతకాలతో సహా చెప్పడం విడ్డూరం. ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాన్ గెలుపు ఆయా నియోజక వర్గాల్లోనే కాదు వారి అభిమానుల్లో తీవ్ర టెన్షన్ పెడుతున్నాయి.
మే 13 న ఎన్నికలు పూర్తవ్వగా దాదాపుగా 20 రోజులకి పైగానే ఈ టెన్షన్ భరించాల్సి వస్తుంది. అదంతా ఒక ఎత్తైతే..ఈ వారం రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్ పై మరింతగా టెన్షన్ పెరిగిపోతుంది చంద్రబాబు సీఎం అవుతారో.. లేదంటే మళ్లీ జగన్ వస్తాడా అనే టెన్షన్ తో ఏపీ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మంగళవారం జూన్ 4 మధ్యహాన్నానికి కానీ ఈ టెన్షన్ తీరేలా కనిపించడం లేదు.