వరలక్ష్మి శరత్ కుమార్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఫాలో అవుతుందా.. అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి రెడీ అయ్యింది అనే న్యూస్ కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది రాజస్థాన్, అలాగే ఇతర దేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
బిటౌన్ సెలబ్రిటీస్ మాదిరిగానే థాయ్‌ల్యాండ్ వేదికగా వరలక్ష్మి శరత్ కుమార్ నికోలాయ్ సచ్‌దేవ్ పెళ్ళికి సిద్దమైంది. ఈ పెళ్లికి ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటుగా.. తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరలక్ష్మికి దగ్గరైన వారంతా హాజరవుతారని, నికోలాయ్ సచ్‌దేవ్ తో వరలక్ష్మి పెళ్లి థాయ్‌ల్యాండ్ లో అంగరంగ వైభవంగా జరగబోతుంది అని సమాచారం.
వరలక్ష్మి పెళ్లి కి ముహూర్తం కూడా పెట్టేశారట. చాలా కాలంగా ప్రేమిస్తున్న నికోలాయ్ సచ్‌దేవ్ తో జులై 2న వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం జరుగబోతుందట. వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. నికోలాయ్ సచ్‌దేవ్ ఇది సెకండ్ మ్యారేజ్. అయితేనేమి.. నా భర్తకి రెండో పెళ్లి అయినా నాకు ప్రాబ్లెమ్ లేదు అంటూ వరలక్ష్మి తన ప్రేమపై నమ్మకంగా ఉంది.
వచ్చే వారం లో జరగబోయే పెళ్లి కోసం శరత్ కుమార్ ఫ్యామిలీ, ఇంకా నికోలాయ్ ఫ్యామిలీస్ థాయ్‌ల్యాండ్ కి బయలుదేరుతున్నట్టుగా కోలీవుడ్ మీడియా లో కథనాలు ప్రసారమవుతున్నాయి.