Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తో విరాట్ ఫ్రెండ్ షిప్


సెలబ్రిటీస్ ఒకరికొకరు ఫ్రెండ్ షిప్ చేస్తే అభిమానులకే కాదు ప్రతి ఒక్కరికి చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. రామ్ చరణ్-ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అనే విషయం ఆర్.ఆర్.ఆర్ వరకు ఎవ్వరికి తెలియదు. అల్లు అర్జున్-తారక్ ఫ్రెండ్ షిప్ సోషల్ మీడియాలో కనిపిస్తేనే అభిమానులు ఆనందపడిపోతారు. ఇక క్రికెటర్స్ తో సినిమా హీరోల ఫ్రెండ్ షిప్ వినడానికే కొత్తగా ఉంటుంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఇలాంటి ఫ్రెండ్ షిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది తారక్-ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం ఎంతమందికి తెలుసు. ఎవ్వరికి తెలియదు. తారక్ తో విరాట్ గంటల కొద్దీ వీడియో కాల్స్ మాట్లాడతాడంటే నమ్ముతారా.. అస్సలు నమ్మరు. కానీ అది నిజం. ఆ విషయాన్ని స్వయానా విరాట్ కోహ్లీని చెప్పడం మరింత ఎగ్జైటింగ్ అయిన విషయం. విరాట్ కొహ్లి గతంలో ఎన్టీఆర్ తో ఓ యాడ్ షూట్ చేసాడు. అప్పుడే ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి తాను ఫిదా అయ్యానని చెబుతున్నాడు. ఎన్టీఆర్ లో చాలా బాగా మాట్లాడే గుణం ఉంది. 

ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్. న‌టుడిగా అత‌న్ని ఎక్కువ‌గా అభిమానిస్తా. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ న‌ట‌న గురించి మాట‌ల్లో చెప్ప‌లేను. అనుష్క‌తో క‌లిసి నాటు నాటు పాట‌కు చాలా రీల్స్ చేసా, అంతేకాదు చాలా సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ కి వీడియో కాల్ చేసి గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుతుంటా అంటూ విరాట్ చెప్పిన ఎన్టీఆర్ స్నేహం పై అందరూ షాకైపోతున్నారు. 

ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వచ్చింది అని తెలిసినప్పుడు మ్యాచ్ ఆడుతూనే.. మైదానంలో డాన్స్ చేశా అంటూ విరాట్ కోహ్లీ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 

Virat Kohli reveals Devara star Jr NTR is his BFF:

Virat Kohli reveals Devara star Jr NTR is his BFF from the Telugu film industry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs