Advertisement
Google Ads BL

పోస్టల్ బ్యాలెట్ పై ఆశలు వదులుకున్న వైసీపీ


ఉద్యోగులంతా వైసీపీ కి అడ్డం తిరిగినట్టే కనిపిస్తుంది. చంద్రబాబు ఓడిపోయి 2019 ఎన్నికల్లో జగన్ సీఎం గా వచ్చినప్పుడు జై జగన్ అన్న ఆంధ్ర ఉద్యోగులంతా ఇప్పుడు జగన్ పై పగ తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. నించోబెట్టి పని చేయించిన చంద్రబాబు అంటే గిట్టని వారంతా జగన్ కి భజన చేసారు. కట్ చేస్తే రెండేళ్లలోనే జగన్ ప్రభుత్వ ఉద్యోగులకి చేదు అయ్యాడు. 

Advertisement
CJ Advs

మరి చంద్రబాబుని తిట్టినవాళ్లంతా ఇప్పుడు చంద్రబాబుకి జై కొట్టేలా ఉన్నారు. గత ఐదేళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వం వలన ఎదుర్కుకున్న ఇబ్బందులని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుని గెలిపించడానికి ఓటేశారు అనేది ఇప్పుడు వైసీపీ అనుకూల బ్లూ మీడియా కూడా ఒప్పుకుంటుంది. కాదు డిసైడ్ అయ్యింది. ఉద్యోగులు మాత్రమే కాదు ఆయా ఫామిలీస్ కూడా చంద్రబాబు కి జై కొట్టారు అంటూ రాతలు రాస్తుంది. 

ఐదేళ్ళలో వాళ్ళు ఎదుర్కున్న సమస్యలతో పోల్చుకుని జగన్ కన్నా చంద్రబాబే బెటర్ అని ఫీలై చంద్రబాబుకి ఓట్లు గుద్దేసినట్టుగా ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ కూటమిదే విజయం అని వైసీపీ బ్యాచ్ తో సహా, బ్లూ మీడియా కూడా ఫిక్సయ్యింది. మరి జగన్ వలన ఉద్యోగులు ఎలాంటి కష్టాలు పడ్డారో.. అందుకే ఇలాంటి గతి పట్టబోతోంది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. 

YCP has given up hope on postal ballot:

All government employees are towards Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs