Advertisement
Google Ads BL

పీకేను.. నమ్మి నట్టేట మునిగారా?


పీకే.. అది నోరా తాటి మట్టా!

Advertisement
CJ Advs

అవును.. మీరు వింటున్నది.. ఇన్నాళ్లు విన్నదీ అక్షరాలా నిజమే.! ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎప్పుడేం మాట్లాడుతారో అంతుచిక్కడం లేదు. ఒకసారి అదిగో.. ఇదిగో అంటారు ఆ మరుసటి రోజే అబ్బే అదంతా తుస్సని చెప్పేస్తున్నారు.! దీంతో ఈయన్ను నమ్ముకుని ఉన్నోళ్లంతా నట్టేట మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై గత కొన్నిరోజులుగా పీకే ఎలాంటి జోస్యం చెబుతున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీ గెలవదంటే గెలవదు.. ఉచితాల వల్ల వైఎస్ జగన్ గెలిచే పరిస్థితి లేదంటే లేదు రాసిపెట్టుకోండి అని పెద్ద పెద్ద శపథాలే చేశారు. ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి ప్రశాంత్ గురించి జగన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా.. మళ్లీ మళ్లీ చెబుతున్నా జగన్ గెలవరబ్బా..? ఎవరైనా సరే ఎన్నికల తర్వాత గెలుస్తామని చెప్పుకుంటారు కానీ.. ఫలితాల రోజు సినిమా కనిపిస్తుందని చెప్పడం గమనార్హం.

ఏం జరుగుతోంది..?

దేశం మొత్తం ఆశ్చర్యపోయి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఫలితాలు ఉంటాయని జగన్ బల్ల గుద్దిమరీ చెప్పారు. పీకే గురించి మాట్లాడుతూ విమర్శలకు కూడా సీఎం ఇచ్చి పడేశారు. ఇక ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలుకుని మంత్రుల వరకూ అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ అటుంచితే.. వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాట్లు కూడా షురూ చేసేస్తోంది వైసీపీ. అయినా సరే వైసీపీకి ఘోర పరాజయమేనని పీకే మళ్లీ ఇంటర్వ్యూ వేదికగా ఏపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ పెద్ద రచ్చే చేశారు. వైసీపీ గెలవదంటే గెలవదు.. కూటమిదే అధికారమని, ఇక కేంద్రంలో మరోసారి ఎన్డీఏదే అధికారమని తేల్చి చెప్పేశారు. గెలుస్తాం.. గెలుస్తామని చెప్పినోళ్లు జూన్-04 రోజున పక్కనే నీళ్లు పెట్టుకుని ఫలితాలు చూడాలని ఉచిత సలహా ఇచ్చారు. దీనికి ఇంతేరీతిలో అటు వైసీపీ నుంచి.. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి అయిన ఇండియా నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయినా పీకే ఇంతగా చెబుతున్నారు సరే.. ఈయన్ను నమ్మి, వ్యూహకర్తగా పెట్టుకొని కోట్ల డబ్బులు పోసి కూడా ఘోరంగా ఓడిపోయిన పార్టీలు లేవా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి.

బెట్టింగ్ రాయుళ్ల పరిస్థితేంటి..?

2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీకి 151 సీట్లు దక్కడంలో కీలక పాత్ర పోషించిన పీకేనే ఇలా చెప్పడంతో బెట్టింగ్ రాయుళ్లు జూలు విదిల్చారు. ఇక చూస్కోండి ఉత్తరాంధ్రలో వేల కోట్లు.. గోదావరి జిల్లాలో లెక్కలేనన్ని లక్షల కోట్లు.. ఇక రాయలసీమలో అయితే బాబోయ్ లెక్కే లేదు. ఇవన్నీ అటుంచితే విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అయితే కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని కొందరు.. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతారని మరికొందరు 43 వేల కోట్ల రూపాయిలు బెట్టింగ్‌లు కట్టారంటే అర్థం చేసుకోండి. కేవలం రెండు నియోజకవర్గాల్లోనే ఈ రేంజిలో ఉంటే.. ఇక మిగిలిన కీలక నియోజకవర్గాల్లో మాటల్లో చెప్పలేం. ఇదిలా ఉంటే.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని కొందరు.. ఓడితే ఎంత మెజార్టీతో ఓడిపోవచ్చు.. గెలిస్తే ఎంత మెజార్టీ రావొచ్చని గట్టిగానే పందేలు కాశారు. అంతేకాదు.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘోరంగా ఓడిపోతారని వందల కోట్లలో బెట్టింగులు.. భారీ మెజార్టీతో గెలుస్తారని వేల కోట్లలో కాశారు. మునుపటితో పోలిస్తే.. ఈసారి జగన్‌ రెడ్డికి ఆశించినంత మెజార్టీ రాదని బెట్టింగ్‌లు కాశారు. ఇలా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో మొత్మమ్మీద లక్షల కోట్లల్లోనే బెట్టింగ్‌ నడిచింది. వీరిలో వందకు 80 శాతం మంది పీకేను నమ్మి.. ఆయన మాటలు నమ్మి బెట్టింగ్‌ కాసినవారేనట. రేపొద్దున్న బొమ్మ తిరగబడితే పరిస్థితేంటో పీకేకి.. బెట్టింగ్ రాయుళ్లకే తెలియాలి మరి.

నీకో దండం సామీ..!

ఇక విమర్శలు, బెట్టింగుల సంగతి అటుంచితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పీకే చేతులెత్తేశారు. జగన్ ఓడిపోతారన్నది తానేమీ సర్వే చేసి చెప్పిందేమీ కాదని.. అదొక అంచనా మాత్రమేనని ఒక్క మాటలో తేల్చేశారు. అంతేకాదు.. కేంద్రంలోని ఓ పెద్ద తలకాయ చెప్పడం వల్లే తాను టీడీపీ అధినేత చంద్రబాబును కలిశానని కూడా చెప్పడం గమనార్హం. అంతటితో ఆగని పీకే.. జగన్‌ కోసం పనిచేస్తున్న ఐప్యాక్, చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఎస్టీసీ రెండు సంస్థలకూ తానే సలహాలు ఇస్తానని కూడా కక్కేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వమని టీడీపీకి చెప్పింది తానేనని.. సైకిల్ గుర్తుపై పోటీ చేయాలని మాగుంటకు చెప్పింది కూడా తానేనని ఓ ఇంటర్వ్యూ వేదికగా ఓపెన్ అవ్వడం గమనార్హం. ఈ ఇంటర్వ్యూను చూసిన జనాలు.. బెట్టింగ్ రాయుళ్లు అది నోరా తాటిమట్టా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియా వేదికగా ఆయన్ను ట్యాగ్ చేసి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. నిన్ను నమ్మడం మా తప్పు.. నీకో దండం మహాప్రభో అని కొందరు ఏకంగా ఫోన్లు చేసి మరీ గట్టిగా ఇచ్చి పడేస్తున్నారట. కోట్లలో బెట్టింగ్ కాసిన వారిన నోట ఎలాంటి మాటలు వస్తాయో ఇక చెప్పనక్కర్లేదు.. ప్రత్యేకించి రాయనక్కర్లేదు కదా.! ఫైనల్‌గా జూన్-04 తారీఖున ఫలితాలు ఎలా ఉంటాయో.. జగన్ చెబుతున్నట్లు దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఫలితాలు ఉంటాయా..? లేకుంటే కూటమిదే గెలుపనే వార్తలు వినాల్సి వస్తుందా..? అన్నది వేచి చూడాలి మరి.

Prashant Kishor.. Are you wise to believe and grow?:

Prashant Kishor BIG prediction for Andhra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs