Advertisement
Google Ads BL

రాజు గారి లెక్క తప్పుతోంది


దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. కారణం దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకులకి ఓ నమ్మకం. ఆయన డెసిషన్ అంటే గురి కనిపిస్తుంది. దర్శకుల ఎంపికలో కానివ్వండి, హీరోలని తీసుకోవడంలో కానివ్వండి, కథలు ఎంచుకునే విధానం కానివ్వండి.. అన్నిటికి దిల్ రాజు కి ఓ లెక్క ఉంటుంది. ప్రేక్షకుడి నాడి దిల్ రాజుకి బాగా తెలుసు.

Advertisement
CJ Advs

కానీ కొద్దిరోజులుగా దిల్ రాజు లెక్క తప్పుతోంది. ఫ్యామిలీ స్టార్ నే తీసుకోండి, ప్రాణం పెట్టి సినిమాని ప్రమోట్ చేసాడు. ఆఖరికి భార్యని కొడుకుని కూడా ప్రమోషన్స్ కి తీసుకొచ్చి ఫ్యామిలీ స్టార్ ని ప్రమోట్ చేసారు. కానీ దిల్ రాజు డెసిషన్ కరెక్ట్ కాదని ప్రేక్షకులు ప్రూవ్ చేసారు.

ప్రస్తుతం థియేటర్స్ లో సినిమాలు లేని సమయంలో సోదరుడు కొడుకు ఆశిష్ హీరోగా తెరకెక్కిన లవ్ మీ చిత్రాన్ని మంచి ప్రమోషన్స్ తోనే థియేటర్స్ లో విడుదల చేసారు. కానీ దిల్ రాజు బ్యానర్, ఆయన సోదరుడి కొడుకే అయినా.. ఆ సినిమాని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. నేను ఏ బిజినెస్ చెయ్యలేను, నాకు సినిమా తియ్యడం తప్ప మరేది తెలియదు అని దిల్ రాజు నమ్మకంగా లవ్ మీ ని ప్రమోట్ చేసినా ఫలితం సూన్యం. ఆ సినిమా విడుదలై నిరాశ పరిచింది.  

ఇలా దిల్ రాజు నుంచి వస్తున్న వరస సినిమాలు చూసాక అయ్యో రాజు గారి డెసిషన్ ఎక్కడో కొడుతోంది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. 

Why Producer Dil Raju’s Judgement Went Wron:

Dil Raju Made A Big Mistake?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs