Advertisement
Google Ads BL

టీడీపీ మౌనంతో ఉడికిపోతున్న బ్లూ మీడియా


వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏమో కానీ.. సీఎం జగన్ స్వయంగా మళ్ళీ మనమే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యబోతున్నామంటూ ఎన్నికల తర్వాత ప్రకటించిన క్షణం నుంచి ఆయన మంత్రి వర్గంలో జగన్ కి భజన చేసిన వారంతా ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి జూన్ 4 న మనమే గెలుస్తాం. మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. జగన్ సీఎం గా జూన్ 9 న ప్రమాణస్వీకారం చేస్తారంటూ ముహుర్తాలు పెట్టి మరీ వాయించేస్తున్నారు. 

Advertisement
CJ Advs

జగన్ సోషల్ మీడియా వింగ్ అంటే ఐప్యాక్ బ్యాహెచ్ అయితే జగన్ జూన్ 9 న ఉదయం 9 గంటలకి వైజాగ్ లో ప్రమాణస్వీకారం చేస్తారు, సంబరాలకు సిద్ధం కండి అంటూ మాట్లాడుతుంటే.. అటు కూటమి నేతలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీరంతా మౌనంగా ఉన్నారు. చంద్రబాబు ఎక్కడ, పవన్ ఎక్కడ అని వైసీపీ నేతలు విపరీతమైన టెన్షన్ పడుతున్నారు. 

మరోపక్క వైసీపీ వాళ్ళు చేస్తున్న జగన్ మరోసారి సీఎం, ప్రమాణస్వీకారమనే హడావిడి చూసి బ్లూ మీడియానే వైసీపీ కి గడ్డి పెడుతుంది. వైసీపీ పెంచి పోషించిన బ్లూ మీడియా ఇంకా ఎన్నికల రిజల్ట్ రాకముందే ఈ ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు అంటూ ఓవ‌రాక్ష‌న్ చేయ‌డం అవ‌స‌ర‌మా, వైసీపీ అతి మామూలుగా లేదే.. అంటూ హెడ్ లైన్స్ వేసి మరీ వైసీపీ కి గడ్డి పెడుతుంది. అటు కూటమి మౌనాన్ని బ్లూ మీడియా భరించలేకపోతుంది. ఇటు వైసీపీ చేస్తున్న అతి ని కూడా బ్లూ మీడియా కట్టడి చేసే ప్రయత్నంలో ఇలాంటి రాతలు మొదలు పెట్టింది. 

Blue media is boiling with silence of TDP:

YSRCP is boiling with silence of TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs