Advertisement
Google Ads BL

మొన్న మెగా.. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ!


నందమూరి ఫ్యామిలీలో చైతన్య చిచ్చు!

Advertisement
CJ Advs

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో ఎంత చిచ్చు పెట్టాయో అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య బయటికి రాకుండా పెద్ద యుద్ధమే నడిచింది. ఆఖరికి ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే తెర వెనుక ఎంత జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అటు ఇటు పెద్దలు కూర్చోబెట్టి పంచాయితీ తేల్చినా ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య జరిగిందేమీ చిన్న విషయం కాదు కదా..! మెగా ఫ్యామిలీ విషయం కాస్త అటుంచితే.. ఈ వివాదం ఇప్పుడిప్పుడే సెట్ అవుతోందని చెప్పుకుంటూ ఉండగా..  నందమూరి ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.

ఏం జరిగింది..?

నందమూరి చైతన్య కృష్ణ.. అదేనబ్బా మొన్న ఆ మధ్య బ్రీత్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడే అతనే. ఇంకాస్త క్లారిటీగా చెప్పాలంటే ఇంస్టాగ్రాంలో మీమ్స్ ఫోటోలు, వీడియోలో చూసే ఉంటారు. విపరీతమైన ట్రోలింగ్ సోషల్ మీడియాలో చైతన్యపై నడిచింది. ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఈ హీరో ఊగిపోతూ వైసీపీ, వైఎస్ జగన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం అప్పుడో సంచలనమే అయ్యింది. ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. నందమూరి బిడ్డగా చెబుతున్నా అంటూ షురూ చేశాడు. ఈ మొత్తం మీద.. తారక్‌ ఫ్యాన్స్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్నది చైతన్యకృష్ణ ప్రధాన ఆరోపణ. 

గుర్తు పెట్టుకోండి..!

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మద్దతు ఇచ్చారని తెలిసిందని..  అయినా సరే ఎవరూ ఏమీ పీకలేరని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు.. నేను ఉండగా మామయ్య చంద్రబాబును, బాబాయ్ బాలకృష్ణను ఎవ్వరూ టచ్ చేయలేరని గట్టిగానే రాసుకొచ్చాడు చైతన్యకృష్ణ. ఈ సందర్భంగా పలు పాత విషయాలు కూడా గుర్తుకు తెచ్చుకొని మరీ వార్నింగ్ ఇచ్చాడు. బ్రీత్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా.. వైసీపీతో కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారని గుర్తు చేసుకున్నాడు. ఇకపై జాగ్రత్తగా ఉండాలంటూ తారక్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. 

నారా.. నందమూరి ఫ్యామిలీలో..!

చూశారుగా.. ఈ ఒక్క పోస్టుతో నారా, నందమూరి కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రాజకీయాలు సంగతి అటుంచితే.. అసలు పాలిటిక్స్ జోలికి ఎన్టీఆర్ రాకపోయినా నిత్యం బుడ్డోడి గురుంచి అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. 

ఇక మేనత్త నారా భవనేశ్వరిని నిండు శాసన సభలో బూతులు తిట్టినా.. చంద్రబాబును అరెస్ట్ చేసినా.. ఆఖరికి ఆంధ్రుల అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా ఎన్టీఆర్ ఎక్కడా కనిపించలేదు. దీంతో నాటి నుంచే ఎన్టీఆర్ అంటే చాలు నారా.. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యర్తలు రగిలిపోతున్నారు. నాటి నుంచే నారా.. నందమూరి కుటుంబాల మధ్య ఒకింత గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు నందమూరి వారసుడే ఇలా ఓపెన్ అవ్వడంతో లోలోపల మరింత కుంపటి రగులుతూ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా లావా లాగా మారొచ్చు. 

కమెడియన్ రా..!

ఇక ఇదే చైతన్య వార్నింగ్ ను వైసీపీ, జూనియర్ ఫ్యాన్స్ ఐతే ఎంత సిల్లీగా అంటే కరివేపాకులా తీసి పడేస్తున్నారు. అరె వీడు కమెడియన్ రా.. లైట్ తీసుకోండి అని ఎన్టీఆర్ అభిమానులు గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు. పొరపాటున చైతన్య మాటలకు ఎవరైనా రెస్పాండ్ ఐతే ఇక మనకోసం మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడని.. ఆ నరకం కంటే ఇదే బెస్ట్ అని నెటిజన్లు సైతం చెబుతున్న మాటలు. చూశారుగా.. ఇవన్నీ కామెడిగానే అనిపించవచ్చు గానీ.. నందమూరి ఫ్యామిలీతో తారక్‌కు గ్యాప్ పెరుగుతూ ఉందని అర్థం అవుతోంది. అంతే కాదు.. ఆ దూరం మధ్య కొలమానం ఎంత అనేది చైతన్యకృష్ణ మాటలు బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే హీరో మాటలను శాంపిల్‌లా కూడా అనుకోవచ్చు. ఇన్ని రోజులు భరించిన ఎన్టీఆర్ రేపు పొద్దున్న మీడియా ముందుకు వచ్చినా.. చిన్న ట్వీట్ రూపంలో రియాక్ట్ ఐతే అప్పుడు అన్నీ సెట్ అవుతాయేమో చూడాలి మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని వెయ్యి కళ్ళతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..!! ఇక ఆలస్యం ఎందుకు వచ్చేయమ్మా.. తారక రామా...!!!

Nandamuri vs NTR :

Nandamuri Chaitanya Krishna gives warning to JR NTR Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs