Advertisement
Google Ads BL

టాప్ 2 కి పడిపోయిన సమంత


సినిమాలు చెయ్యకపోయినా.. షూటింగ్స్ లో కనిపించకపోయినా.. అభిమానులు సోషల్ మీడియా లో విపరీతంగా సెర్చ్ చెయ్యడమే కాకుండా.. సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటూ.. ట్రెండ్ అయ్యే హీరోయిన్ సమంత ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఇచ్చే సర్వే లో ఎక్కువగా టాప్ 1 లోనే నిలుస్తుంది. సక్సెస్ రేట్ తో టాప్ 1 లో కాదు.. సోషల్ మీడియా పాపులారిటి తోను టాప్ 1 లో నిలవొచ్చని సమంత చూపించింది. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పడు ఆర్మాక్స్ మీడియా మే నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియన్ హీరోయిన్లు ఎవరన్న దానిపై సర్వే చేసింది. అందులో బాలీవడ్ బ్యూటీ అలియా భట్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక సినిమాలేవీ చేతిలో లేకపోయినా.. టాప్ 1 పొజిషన్ లో ఉండే సమంత ఈసారి టాప్ 2 తో సరిపెట్టుకుంది. 

కల్కి తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దీపికా పదుకొనె టాప్ 3 లో నిలవగా.. వరసగా పాన్ ఇండియా అవకాశాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక టాప్ 4 లోకి వెళ్ళింది. సత్యభామతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కాజల్ టాప్ 5 లో చోటు దక్కించుకుంది. టాప్ 6లో కృతి సనన్ నిలవగా, టాప్ 7 లో కత్రినా కైఫ్, టాప్ 8 లో కియారా అద్వానీ నిలిచారు. 

ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా కనిపిస్తున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల టాప్ 9లో నిలవగా.. టాప్ 10లో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్  నయనతార నిలిచింది. 

Samantha who fell to the top 2:

Aramex Media: Alia Bhatt tops the female list of most popular stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs