Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ వల్ల సఫర్ అయ్యానంటున్న హీరోయిన్


గతంలో ఎన్టీఆర్-చిరంజీవి చిత్రాల్లో నటించి ఆ తర్వాత టాలీవుడ్ నుంచి మాయమైపోయిన సమీరా రెడ్డి కొన్నేళ్ల తర్వాత పర్సనల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని ఇద్దరి బిడ్డలకి తల్లయ్యింది. ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ అంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించడంతో సమీరా రెడ్దికి-ఎన్టీఆర్ కి మద్యన ఎఫ్ఫైర్ నడిచింది, వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ చక్కర్లు కొట్టింది. అప్పట్లో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సమీరా రెడ్డికి వార్నింగ్ ఇవ్వడంతో సమీరా టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసింది అని చెప్పుకున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా సమీరా రెడ్డి ఎన్టీఆర్ గురించి అనేక విషయాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి, ఎన్టీఆర్ తో వర్క్ చేస్తున్నపుడు సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ఎన్టీఆర్ నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, దానితో చాలామంది తామిద్దరి మధ్య అఫైర్ అంటగట్టారు. అప్పట్లో ఆ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది, ఈ విషయంలో నేను నా తండ్రికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. 

అంతేకాదు రిలేటివ్స్ కూడా ఈ రూమర్ నిజమేనా అని అడిగేవారు, నేను అటువంటిదేమీ లేదని చెప్పాను, ఆ సమయంలో తమ ఫ్యామిలీ ఆ రూమర్ వలన చాలా సఫర్ అయ్యింది అంటూ సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. 

The heroine is said to have suffered because of NTR:

Sameera Reddy says NTR is a good person
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs