అక్కినేని అఖిల్ కొత్త మూవీ కబురు కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. ఏజెంట్ డిజ్ పాయింట్ చేసాక అఖిల్ కొత్త ప్రాజెక్ట్ విషయంలో సైలెంట్ అయ్యాడు. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ధీర అనే టైటిల్ తో అఖిల్ కొత్త సినిమా ఉంటుంది అని ఏజెంట్ విడుదలకు ముందు ప్రచారం జరిగింది.
ఏజెంట్ రిజల్ట్ తర్వాత అఖిల్ మొత్తంగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. కొత్త ప్రాజెక్ట్ విషయంలో అభిమానులు అడుగుతున్నా సైలెంట్ గానే కనిపించాడు కానీ.. ఎక్కడా హడావిడి పడలేదు. ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్న అఖిల్ కొత్త ప్రాజెక్ట్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించగానే అక్కినేని అభిమానులు అలెర్ట్ అవుతున్నారు.
అఖిల్ కొత్త ప్రాజెక్ట్ యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది, ఈ ప్రాజెక్ట్ కి అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు, అఖిల్ కొత్త ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ అంటే దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుంది అనే న్యూస్ చూసాక అక్కినేని అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. అదెప్పుడు పట్టాలెక్కుతుందా ఆ శుభతరుణం త్వరగా రావాలని వారు కోరుకుంటున్నారు.