Advertisement
Google Ads BL

టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


ఆర్.ఆర్.ఆర్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ దేవర చిత్రంపై యంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా ఆశలు, నమ్మకాన్ని పెట్టుకున్నారు. దేవర చిత్రాన్ని కొరటాల బ్రహ్మాండంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని సంబరపడుతున్నారు. కానీ అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళన పడాల్సి వస్తుంది. కారణం దేవర మ్యూజిక్ ఆల్బమ్. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ బర్త్ డే రోజున వదిలిన దేవర ఫస్ట్ సింగిల్ పై మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అనిరుద్ రవిచంద్రన్ దేవర టైటిల్ ట్రాక్ తో డిజ్ పాయింట్ చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డల్ అయ్యారు. మరోపక్క ఇండియన్ 2 నుంచి వస్తున్న సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోవడంతో అనిరుద్ పై అనుమానాలు మొదలయ్యాయి. 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతగా టెన్షన్ పడడానికి కారణం అల్లు అర్జున్ పుష్ప సాంగ్స్ ఒక్కొక్కటిగా మ్యూజిక్ లవర్స్ ని ఊపెయ్యడమే కాదు, యూట్యూబ్ లో రికార్డ్ లైక్స్ కొడుతూ హల్చల్ చెయ్యడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కలత మొదలైంది. దేవర సాంగ్ పుష్ప సాంగ్ దరిదాపుల్లో లేదు అనే కామెంట్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయి. 

కోలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా మార్కెట్ లో అనిరుద్ మ్యూజిక్ కి అభిమానులు ఎక్కువయ్యారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఆకట్టుకోలేని మ్యూజిక్ ఇచ్చి దేవరని ఏం చేస్తాడో అనే భయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనబడుతున్నారు. చూద్దాం మిగతా సాంగ్స్ పరిస్థితి ఏమిటి అనేది. 

NTR fans are tensed:

A Mountain of Tension for NTR Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs