Advertisement
Google Ads BL

హమ్మయ్య.. ‘దేవర’ పాటలా లేదులే!


యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు 2’ సినిమా నుంచి విడుదలైన ‘శౌర’ పాట విన్నవారంతా చెబుతున్న మాట ఏమిటంటే.. ‘హమ్మయ్య.. దేవర ఫియర్ పాటలా లేదులే’ అనే. ఎందుకంటే ఈ రెండు చిత్రాలకు సంగీతం అందిస్తోంది అనిరుద్ రవిచంద్రనే. రీసెంట్‌గా ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేసిన పాట విషయంలో అభిమానులే పెదవి విరిచారు. కారణం ఆ పాటలో మ్యూజిక్ డామినేషన్ ఎక్కువైందనేలా అంతా కామెంట్స్ చేయడం విశేషం. 

Advertisement
CJ Advs

పాట లిరిక్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నా కూడా.. ఎన్టీఆర్ మీద అనిరుద్ ప్రేమ ఎక్కువ చూపించడంతో పాట జనాలకి అర్థం కాకుండా తయారైంది. ఏదో ఎన్టీఆర్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉండబట్టి సరిపోయింది కానీ.. లేదంటే ఆ పాటపై ఇప్పటికే భారీగా ట్రోలింగ్ జరిగేది. బర్త్‌డే కూడా కలిసి రావడంతో.. ఎలా ఉన్నా ఫ్యాన్స్ కూడా ఈసారి అనిరుద్ ఇచ్చే పాట అదిరిపోతుందిలే అనే ఊహలో అడ్జస్ట్ అయ్యారు.. అవుతున్నారు.

ఇక తాజాగా విడుదలైన ‘భారతీయుడు 2’ పాట విషయంలో మాత్రం అంతా హ్యాపీగానే ఉన్నారు. లిరిక్స్ పరంగా ‘దేవర’ పాటకి ఏ మాత్రం తగ్గని విధంగా ఉన్న ఈ పాటని అనిరుద్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని కంపోజ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అందుకే అంతా ఈ పాటని దేవరకి లింక్ పెడుతూ.. ‘శౌర’ పాట బాగుందనేలా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కోలీవుడ్‌పై అనిరుద్ ప్రేమ చూపించాడనేలా కూడా కామెంట్స్ చేస్తున్నారండోయ్.. 

Positive Response to Bharateeyudu 2 Souraa Song:

Bhartiyadudu 2 Souraa Song Received Positive response compared to Devara song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs