Advertisement
Google Ads BL

తండేల్ చిత్ర స్టోరిని రివీల్ చేసిన చైతు


నాగ చైతన్య-చందు మొండేటి కాంబోలో బన్నీ వాస్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ తండేల్. ఈ చిత్రంలో నాగ చైతన్య రఫ్ గా రాజు కేరెక్టర్ లో కనిపించనున్నాడు. శ్రీకాకుళం జాలరి పేట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ అందరిని తెగ ఇంప్రెస్స్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న తండేల్ స్టోరీపై చైతు కామెంట్స్ వైరల్ గా మారాయి.

Advertisement
CJ Advs

తండేల్ కథ రియల్ స్టోరీ అంటూ నాగ చైతన్య అందరిలో ఆసక్తిని పెంచేసాడు. చేపలు వేటాడే రాజు అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని.. సముద్రంపై చేపల వేటకి వెళ్లిన రాజు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడ ఆర్మీ రాజుని రెండేళ్లపాటు పాకిస్తాన్  జైల్లో జైల్లో ఖైదీగా చేసింది. రెండేళ్ల తర్వాత రాజు  జైలు నుంచి బయటకొచ్చాడు.

రాజు కేరెక్టర్ ని ఓన్ చేసుకోవడంతో పాటుగా శ్రీకాకుళం వెళ్లి అక్కడ వాతావరణం, అలాగే రాజు పాత్రని అర్ధం చేసుకొని పూర్తి స్థాయిలో ఓన్ చేసుకోవడానికి తనకి తొమ్మిది నెలలు సమయం పట్టింది, శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకోవడంతో పాటు రాజు ఇంటికి కూడా వెళ్లి అతనితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాను.. అంటూ నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో తండేల్ కథని రివీల్ చేసాడు.

Naga Chaitanya About Thandel Story:

Naga Chaitanya shares Thandel secrets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs