2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో చాలామంది చాలారకాలుగా లెక్కలు వేస్తున్నారు. కూటమికి 80 కి పైగా సీట్స్ వస్తాయని కొంతమంది అంటున్నారు. అలాగే వైసీపీ కి కూడా 85 సీట్లు వస్తాయి.. అలా వస్తే ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ జనసేన అంటున్నారు. ఇక టీడీపీ ఆశావహులు 135 ప్లస్ సీట్లు కూటమి గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే వైసీపీ వాళ్ళు 150 ప్లస్ అంటూ కాన్ఫిడెంట్ చూపిస్తున్నారు.
అలా ఉంటే ఎన్నికల తర్వాత మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. టీడీపీ నేతలు కూడా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. కానీ సీఎం జగన్ మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతానని ధీమాతో ఉన్నాడు. వైసీపీ నేతల్లో ముఖ్య నేతలంతా మీడియా ముందు కనిపించడమే కాకుండా.. జగన్ మరోసారి సీఎం అవుతారని, ఆయన ప్రమాణస్వీకారానికి ముహుర్తాలు, తేదీలు చెప్పుకుంటున్నారు.
మంత్రి బొత్స దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్, రోజా, పేర్ని నాని, అంబటి, పెద్దిరెడ్డి, సజ్జల వీరంతా మీడియాతో మట్లాడుతూ వైసీపీ గెలుస్తుంది, 150 సీట్లు వైసీపీ కి వస్తుంది, జగన్ జూన్ 9 న వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ చాలా కాఫిడెంట్ గా చెబుతుంటే.. టీడీపీ కేడర్, నేతలు అందరూ నైరాశ్యంలోకి వెళ్ళి సైలెంట్ గా కనిపిస్తున్నారంటూ చాలామంది కామెంట్ చెయ్యడం గమనార్హం.