యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే వచ్చింది, అభిమానుల ఆనందోత్సాహాల నడుమ, కొత్త సినిమాల అప్ డేట్స్ తో సందడిగా ముసిగింది. ఎన్టీఆర్ మాత్రం బర్త్ డే కి తన వైఫ్ ప్రణతి, ఫ్రెండ్ తో కలిసి విదేశీ ట్రిప్ వెళ్ళిపోయి.. వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకున్నాడు.
ఇక బర్త్ డే స్పెషల్ గా దేవర నుంచి ఫియర్ సాంగ్ అభిమానులని తెగ ఊపెయ్యగా.. ముఖ్యంగా ఎన్టీఆర్-నీల్ మూవీ అప్ డేట్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. వార్ 2 నుంచి అప్ డేట్ ని ఎక్స్పెక్ట్ చేసిన ఎన్టీఆర్ అభిమానులు కాస్త డిజ్ పాయింట్ అయినా.. మిగతా బర్త్ డే అప్ డేట్స్ మాత్రం అభిమానులకి కిక్ ఇచ్చాయి.
ఇక బర్త్ డే రోజున ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కండలని ని చూపిస్తూ ఎన్టీఆర్ ఇచ్చిన ఫోజ్ అభిమానులని తెగ ఇంప్రెస్స్ చేసింది. వార్ లో హృతిక్ రోషన్ తో పోటీ పడాలంటే ఎన్టీఆర్ కి ఈ మాత్రం జిమ్ బాడీ అవసరమే, హృతిక్ కి ఈ రకంగా ఎన్టీఆర్ గట్టి పోటీ ఇవ్వడం పక్కా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.