బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం దుబాయ్ లో ఎంజాయ్ చేస్తుంది. దుబాయ్ లో కాఫీని సిప్ చేస్తూ ఆ పిక్స్ సోషల్ మీడియాలో వదిలింది. ఆ ఫొటోస్ లో పూజ హెగ్డే చాలా మోడ్రెన్ గా ట్రెండీ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది. అందం, నటన, గ్లామర్ ఉన్నా అదృష్టం లేకపోతే హీరోయిన్స్ కెరీర్ డోలాయమానం అన్నట్టు కొంతమంది హీరోయిన్స్ ని చూస్తే తెలుస్తుంది.
ఒకప్పుడు నాలుగు షిఫ్ట్ ల్లో పని చేసిన పూజ హెగ్డే ఇప్పుడు కాస్త ఖాళీగానే దర్శనమిస్తుంది. హిందీ ప్రాజెక్ట్స్ తప్ప సౌత్ లో పూజ హెగ్డే కి ఆఫర్స్ లేవు. ఈ మధ్యన సిద్దు జొన్నలగడ్డ, సూర్య లతో పూజ హెగ్డే కి అవకాశం వచ్చింది అనే ప్రచారం జరిగినా.. అవి జస్ట్ రూమర్స్ గానే మిగిలిపోయాయి.
హిందీ సినిమాల షూటింగ్స్ కి హాజరవుతున్న పూజ హెగ్డేకి కాస్త బ్రేక్ దొరకడంతో దుబాయ్ ట్రిప్ వేసింది. అక్కడ రిలాక్స్ అవుతూ కనిపించిన పూజ హెగ్డే కాఫీని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.