లోకనాయకుడు కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నారు అనగానే అటు అంచనాలు, ఇటు ఆసక్తి అందరిలో ఎక్కువైపోయాయి. అసలు కమల్ హాసన్ కల్కి లో ఎలా కనిపిస్తారో.. అనే ఆత్రుత అందరిలో మొదలైంది. కానీ మొన్నామధ్యన కమల్ హాసన్ తాను కల్కిలో గెస్ట్ రోల్ మాత్రమే చేసానని చెప్పడంతో అందరూ డిస్పాయింట్ అయ్యారు.
అయితే కల్కి చిత్రంలో కమల్ హాసన్ పాత్ర రన్ టైమ్ పై ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. దాదాపు 20 నిమిషాలు పాటు కమల్ హాసన్ స్క్రీన్ పై కనిపించనున్నారు అని తెలుస్తోంది. పార్ట్ 1 లో 20 నిమిషాలే అయినా.. కల్కి పార్ట్ 2 లో 90 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. మరి కల్కి 1 లో 20 నిమిషాలంటే ఆయన అభిమానులు, మిగతా మూవీ లవర్స్ బెంగపడక్కర్లేదు, కమల్ రోల్ వచ్ఛినంతసేపు చూసి ఎంజాయ్ చెయ్యడమే.
ఈ చిత్రం మరొక్క నెలలో అంటే జూన్ 27 న విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి టీమ్ సిద్ధమైంది. రేపు రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ అభిమానుల నడుమ కార్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు మేకర్స్.