Advertisement
Google Ads BL

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో ట్విస్ట్‌


ప్రస్తుతం టాలీవుడ్ జనాలని బెంగుళూరు రేవ్ పార్టీ గడగడలాడిస్తోంది. బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో గత రాత్రి జరిగిన రేవ్ పార్టీలో బెంగుళూరు, హైదరాబాద్ కి చెందిన ప్రముఖులు పోలీసులకి పట్టుబడ్డారు. అందులో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన వారి పేర్లు బయటకి రావడం కలకలం సృష్టించింది. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా నటుడు శ్రీకాంత్, నటి హేమ పేర్లు టాలీవుడ్ నుంచి బెంగుళూరు రేవ్ పార్టీలో హైలెట్ కాగా, నటుడు శ్రీకాంత్ తాను ఏ పార్టీలో పాల్గొనలేదు అని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ తన ఇంట్లో నుంచి ఓ వీడియో తీసి వదిలాడు. తనలాంటి వ్యక్తి ఆ పార్టీలో పట్టుబడడంతో అందరూ తననే అనుకున్నారని శ్రీకాంత్ వివరణ ఇచ్చాడు. 

అలాగే నటి హేమ కూడా తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను ఇక్కడే చిల్ అవుతున్నాను, నేను బెంగుళూరు రేవ్ పార్టీలో లేను, నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లోనే ఉన్నాను అంటూ వీడియోతో బుకాయించాలని చూసింది. 

కానీ బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు నటి హేమ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టడమే కాదు.. తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్టుగా హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్‌హౌస్‌లో షూట్‌ చేసిందేనని పోలీసులు.. హేమ వీడియో పై రియాక్ట్ అయ్యారు.. ఆ వీడియో తో హేమ ఖచ్చితంగా రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తమకి క్లారిటీ వచ్చింది అని చెబుతున్నారు. పాపం హేమ బుకాయించినా లాభం లేకుండా పోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

A twist in the Bangalore rave party case:

Actress Hema reacts on Bangalore rave party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs