Advertisement
Google Ads BL

రేవ్ పార్టీతో సంబంధం లేదంటున్న శ్రీకాంత్


హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్‌హౌస్‌ లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో ఏపీ అలాగే బెంగళూరుకు చెందిన చాలామంది ప్రముఖులు పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్లు గుర్తించారు. 

Advertisement
CJ Advs

సీసీబీ పోలీసుల బృందం దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన బర్త్‌డే పార్టీని బెంగళూరు శివారులోని ఓ వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ యాంటీ నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించింది. 

ఈ క్రమంలోనే 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్‌, కొకైన్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్‌, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గుర్తించారు. అయితే ఈ పార్టీలో తెలుగు హీరో శ్రీకాంత్ పాల్గొన్నారంటూ పలు వెబ్ సైట్స్ లో, న్యూస్ ఛానల్స్ లో ప్రచారం జరుగుతుంది. 

తాజాగా ఈ వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. తాను ఎలాంటి పార్టీలో పాల్గొనలేదు, తాను బెంగుళూరుకి వెళ్ళలేదు, తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా, కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని శ్రీకాంత్ సినీజోష్ టీమ్ కి తెలిపారు.  

Srikanth says he has nothing to do with the rave party:

Srikanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs