Advertisement

అందరి చూపు వార్ 2 అప్డేట్ పైనే..


సోమవారం మే 20.. ఎన్టీఆర్ అభిమానులకి పండగ రోజు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. మరి ఆయన బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పూనకాలొచ్చేస్తాయి కదా. ఎన్టీఆర్ కటౌట్స్‌కి పాలాభిషేకాలు, బ్యానర్‌లు కట్టి పూజలు చెయ్యడం, కేక్ కటింగ్స్ అబ్బో అభిమానుల రచ్చ మాములుగా ఉండదు. 

Advertisement

అంతేకాదు.. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ నుంచి అప్డేట్స్‌తో సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా కాదు.. రచ్చ రచ్చే. ఇప్పటికే ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం దేవర నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. గత నాలుగు రోజులుగా మేకర్స్ దేవర సాంగ్ పై తెగ ఊరించేస్తూ అప్డేట్స్ వదులుతూ దేవరను ట్రెండ్‌లో ఉంచారు. అది ఓకే.. 

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకుల చూపు మొత్తం వార్ 2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే‌కి వదలబోయే అప్డేట్ పైనే ఉంది. ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతున్న వార్ 2 కి సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా చేశాడు. హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఎన్టీఆర్ వార్ 2 కేరెక్టర్ పై అందరిలో విపరీతమైన అంచనాలున్నాయి. 

అందుకే ఎన్టీఆర్ బర్త్ డే‌కి వార్ 2 నుంచి ఏమైనా ట్రీట్ వస్తుందేమో అనే కుతూహలంతో అభిమానులు కనిపిస్తున్నారు. మరి వార్ 2 మేకర్స్ అలాంటి ఏర్పాట్లేమన్నా చేస్తున్నారా.. లేదంటే అభిమానులను డిజప్పాయింట్ చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.

NTR Fans Waiting For War 2 Update:

Happy Birthday Young Tiger NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement