మెగా హీరో నాగబాబు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ జెండాని ఎత్తుకుని తాత్కాలికంగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ ఎన్నికల్లో నాగబాబు ఎమ్యెల్యేగానో, లేదంటే ఎంపిగానో పోటీ చేస్తారని అనుకున్నారు కానీ కూటమి కోసం నాగబాబు సీటు త్యాగం చెయ్యాల్సి వచ్చింది. అయితే తమ్ముడు పవన్ కి అండగా నిలుస్తున్న నాగబాబు తాజాగా ట్విట్టర్ X నుంచి మాయమయ్యారు.
కారణం అల్లు అభిమానులు నాగబాబు ని అంతలా టార్చర్ పెట్టడమే ప్రధాన కారణం. నాగబాబు రీసెంట్ గా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై ఇండైరెక్ట్ గా ట్విట్టర్ X లో చేసిన ట్వీట్ అల్లు ఫాన్స్ కి నాగబాబు టార్గెట్ అయ్యేలా చేసింది. తనవాడు, పరాయివాడు అంటూ అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ పెట్టాడు.
దానితో అది అల్లు అర్జున్ నే అన్నారని అల్లు ఫాన్స్ రెచ్చిపోయి నాగబాబుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నాగబాబు అల్లు అభిమానుల తిట్ల దండకం వినలేక ట్విట్టర్ X నుంచి వెళ్లిపోయారు. తన అకౌంట్ ని డిలేట్ చేసేసారు. దానితో అల్లు అర్జున్ ఫాన్స్ కి భయపడిన నాగబాబు అంటూ హేళన చేసారు.
తాజాగా నాగబాబు మళ్ళీ ట్విటర్ X లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెప్పడమే కాదు, వివాదానికి కారణనమైన ట్వీట్ ని డిలేట్ చేస్తూ.. I have deleted my tweet అంటూ వివరణ ఇచ్చుకున్నారు.