అనసూయ భరద్వాజ్ ఏ విషయమైనా పబ్లిక్ గానే చెబుతుంది. పర్సనల్ విషయమైనా, కెరీర్ విషయమైనా ఓపెన్ గా మాట్లాడే గట్స్ ఉన్న నటి అనసూయ. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ని తెగ ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్ లోనే అనసూయ తన బర్త్ డే ని భర్త భరద్వాజ్, పిల్లలు మధ్యన సెలెబ్రేట్ చేసుకుంది.
ఆతర్వాత తమ రూమ్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకుని ఆనందంగా ఉన్న ఫొటోస్ ని కూడా షేర్ చేసింది. ఇక తాజాగా అనసూయ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉన్న ఫొటోస్ ని గత రెండుమూడు రోజులుగా అభిమానులతో పంచుకుంటుంది.
వాటర్ తో ఆడుకుంటూ.. పిల్లలతో అలాగే భర్త భరద్వాజ్ తో కలిసి అనసూయ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అనసూయ హ్యాపీనెస్ చూసిన ఆమె అభిమానులు.. Queen of million heart ❤️ our madam, once more Happy Birthday madam అంటూ కామెంట్ చేస్తున్నారు.
అన్నట్టు అనసూయ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప ద రూల్ నుంచి ఆమె పుట్టిన రోజు స్పెషల్ గా వచ్చిన దాక్షాయణి మాస్ లుక్ అందరిని ఇంప్రెస్స్ చేసింది.