Advertisement
Google Ads BL

ఎన్నికల తర్వాత పవన్ సంచలన లేఖ!


పిఠాపురం ప్రజలు, వర్మకు పవన్ ధన్యవాదాలు!

Advertisement
CJ Advs

ఏపీలో గత నాలుగైదు నెలలుగా రాత్రనక.. పగలనక కష్టపడిన అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నికలు అలా ముగిసే సరికి కాస్త విశ్రాంతి తీసుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికల కోసం కష్టపడిన కార్యకర్తలకు, అభిమానులు, పార్టీ శ్రేణులకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు.

లేఖలో ఏముంది..?

ప్రియమైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నమస్కారం..

ఈ నెల 13న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన నన్ను ఆదరించి అండగా నిలిచి మీరు చూపించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నానని ప్రకటించగానే స్వచ్చందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పని చేయడం ఎంతో ఆనందం కలిగించింది. ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకూ  పోలింగ్ లో పాల్గొని రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు అవ్వడం అనేది మీ ప్రేమను తెలియజేస్తుంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు, టిడిపి, బిజేపి కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయం.

వర్మకు.. వందనాలు!

వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ.. తన సీట్ త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వర్మ గారికి.. వారి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో వర్మ గారు అందించిన సహకారం మరువలేనిది. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పని చేస్తారని నమ్ముతున్నాను. అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం వర్మ గారి అనుభవం వినియోగించుకుంటూ.. కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగే నిన్న పుట్టినరోజు వేడుకలు చేసుకున్న వర్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజా జీవితంలో కొనసాగాలని శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. 

పేరు పేరునా ధన్యవాదాలు!

కుటుంబ సభ్యుడికి, నాకు అండగా ఉండేందుకు తమ సినిమాలు, ధారావాహిక లకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతీ గడపకు వెళ్ళి ప్రచారం చేసిన సినీ, బుల్లి తెర నటీ, నటుల ప్రేమ నన్ను కదిలించింది. నా విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అలాగే దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు నా అభినందనలు. పిఠాపురంలో మార్పునకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని మాటిస్తున్నాను అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

Pawan sensational letter after the election!:

Pawan Kalyan Sensational Letter to AP People
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs