నిన్నటివరకు తాము చెప్పినట్టుగా ఆడిన ఏపీ పోలీసు వ్యవస్థ పై వైసీపీ నేతలు, మంత్రులు అంతా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమకి ఇష్టమైన, వైసీపీ కి కొమ్ము కాసిన పోలీస్ అధికారులని ఎలక్షన్స్ జరిగే ముందు ఈసీ నిర్ధాక్షిణ్యంగా బదిలీలు చేసి వైసీపీ నేతలకి గట్టి షాకిచ్చింది. ఇక పోలింగ్ తేదీ రోజున చాలా చోట్ల వైసీపీ మరియు టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
దానితో పోలీసులు కొరడా ఝులిపించారు. ఆ నెక్స్ట్ డే నుండి వైసీపీ నేతలంతా కట్టకట్టుకుని పోలీస్ వ్యవస్థ మొత్తం టీడీపీ చెప్పినట్టుగానే పని చేసింది అంటూ రాగాలు మొదలు పెట్టారు. కూటమిలో టీడీపీ-బీజేపీ-జనసేన మాత్రమే కాదు పోలీస్ వ్యవస్త కూడా నాలుగో పార్టీగా చేరి సేవలు చేసింది అంటూ అంబటి రాంబాబు పెట్టిన ట్వీట్ వైరల్ అయ్యింది.
రోజా, కొడాలి నాని,పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యన్నారాయణ వంటి వాళ్లంతా మీడియా ముందుకు వచ్చి పోలీస్ లు టీడీపి అందులోను చంద్రబాబు ఆడించినట్టుగా ఆడారు అంటూ గోల పెట్టారు. అసలు గెలుపు కూటమిదే అని వైసీపీ డిసైడ్ అయ్యి నేరం మొత్తం పోలీస్ వ్యవస్థపై నెట్టేస్తుంది అనే టాక్ వినిపిస్తుంది.
అయినా పోలీసులు అంతా యాంటీగా మారడానికి కారకులెవరు. చంద్రబాబుని జైలు లో పెట్టినప్పుడు ఒక పోలీస్ ఉన్నతాధికారి చంద్రబాబు విడుదలయ్యాక రహస్యంగా వచ్చి బాబు గారిని కలిసి జగన్ చెప్పినట్టుగా చెయ్యకపోతే మా జాబ్ ఉండదని బాధపడినట్లుగా చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే జగన్ ప్రభుత్వంలో పోలీసులు ఎదుర్కొన్న సమస్యలు వలనే వారు వైసీపీకి యాంటీ గా మారి ఉంటారని అందరూ చెప్పుకుంటున్నారు.