పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2014 లో టీడీపీ-బిజెపి తో కలిసి ఎన్నికలకి వెళ్ళి టీడీపీ కి అధికారాన్ని కట్టబెట్టి.. ఆతర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాన్ ఈ ఐదేళ్లలో ఎలా ఉన్నా ఈ ఏడాదిలో ఆయన రాజకీయంగా చాలా కష్టపడ్డాడు. 2024 ఎన్నికల కోసం కూటమి కట్టడంలో పవన్ కళ్యాన్ కృషి చెప్పనలవి కాదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి టీడీపీ తో పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బిజెపితో టీడీపీ ని కలపడానికి చాలా పాట్లు పడ్డాడు.
టీడీపీ తో బీజేపీ కలవడమనేది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే. మరి కూటమిలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కూటమి గెలిస్తే అతనికి ఒరిగేదేమిటి. ఒకరేమో కూటమి గెలిస్తే పవన్ కళ్యాన్ ఇరిగేషన్ శాఖపై కన్నేశాడు అంటారు. కాదు పవన్ కళ్యాణ్ గెలుపుని ఆస్వాదించాక ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి తర్వాత క్యాబినెట్ లోకి ఎంటర్ అవుతాడు అంటారు.
మరికొందరు ఆయనకి పోలీస్ శాఖ విషయంలో క్లారిటీ ఉంది, రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అరాచకాలని ఏకరువు పెట్టి చెప్పగలరు, అందుకే ఆయన చంద్రబాబు క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ పదవి చేపడతారు, పవన్ కళ్యాణ్ ఎనర్జికి అదే కరెక్ట్ అంటూ మాట్లాడుతున్నారు.
పవన్ త్వరగా సినిమాలు ముగించేసి ఆంధ్ర రాజకీయాల్లో ముఖ్యంగా చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్నత పదవి చేపట్టాలని జనసైనికులు, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కోరుకుంటున్నారు.