అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో బుల్లితెర ని పూర్తిగా పక్కనపెట్టేసింది. వెండితెర మీద రజాకార్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉంది. మధ్య మధ్యలో ఫ్యామిలీ తో ముఖ్యంగా భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి వెకేషన్స్ కి వెళుతూ సందడి చేస్తుంది.
ఈరోజు మే15 అనసూయ భరద్వాజ్ పుట్టిన రోజు. ఆమె నటిస్తున్న సినిమాల నుంచి విషెస్ అందుకున్న అనసూయ తన బర్త్ డే ని నేచర్ లో భర్త, పిల్లలతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. అక్కడే కేక్ కట్ చేసి పిల్లలకి తినిపిస్తున్న పిక్స్ ని Praying to the Almighty that I have to be this deserving to receive all your love always.. I have received all your sweet wishes.. have y’all received my cake which I ate on your behalf?? 😛🫣🫠♥️🙏🏻#SoGratefulThankfulBlessed 🧿❤️🙏🏻 అంటూ షేర్ చేసింది.
ఎప్పటిలాగే గ్లామర్ గా అనసూయ హుషారుగా తన బర్త్ డే ని వెకేషన్ లో అది కూడా నేచురల్ లో సెలెబ్రేట్ చేసుకోవడం పట్ల ఆమె అభిమానులు ఆనందపడుతున్నారు. నేచర్ ని లవ్ చేసే అనసూయ ఎక్కువగా తన ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ట్రిప్స్ కి వెళుతూ రిలాక్స్ అవుతుంది. ఈ ఏడాది తన పుట్టిన రోజు ని కూడా అనసూయ ఇలా ఫ్యామిలీతో కలిసి సరదాగా సెలెబ్రేట్ చేసుకుంది.