జబర్దస్త్ లో ఫేమ్ తెచ్చుకుని ఆ తర్వాత బిగ్ బాస్ తో స్టార్ మా కె అంకితమై ఈటివి ని పూర్తిగా పక్కనపెట్టిన జబర్దస్త్ ముక్కు అవినాష్ కి 2021లో పెద్దలు నిశ్చయించిన అనూజ తో వివాహమయ్యింది. పెళ్లి తర్వాత అనూజతో కలిసి స్టార్ మా ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న అవినాష్ ఆ తర్వాత తన భార్య తో కలిసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రతి విషయాన్నీ పంచుకుంటున్నాడు.
గత ఏడాది అనూజ్ ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ వినిపించడమే కాదు.. అనూజ బేబీ బంప్ ఫొటోస్ షూట్ దగ్గర నుంచి ఆమెకి శ్రీమంతం చేసిన వీడియో, ఫొటోస్ కూడా షేర్ చేసాడు. అయితే ఈ ఏడాది అవినాష్, అనూజలు తాము బిడ్డని కోల్పయిన బ్యాడ్ న్యూస్ ని పంచుకున్నారు. ఆ తర్వాత ఆ విషయమై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు అంటూ అవినాష్ తన అభిమానులని వేడుకున్నాడు.
తాజాగా అవినాష్ తమ బిడ్డని ఎలా కోల్పోయామో అనేది వివరించాడు. ఐదు నెలల క్రితమే తాము బిడ్డని కోల్పోయామని, తెల్లవారితే అనూజ డెలివరీ అనగా బిడ్డ కదలికలు ఆగిపోయాయి. నేను అప్పుడు షూటింగ్ లో ఉన్నాను. అనూజని ఆసుపత్రికి తీసుకు వెళితే డాక్టర్స్ బిడ్డ గుండె కొట్టుకోవడం లేదు, బిడ్డ ఉమ్మనీరు తాగడం వలనే ఇలా జరిగి ఉండవచ్చని చెప్పారు.
నేను డాక్టర్ దగ్గరకి వెళ్లి ఏదో ఒకటి చెయ్యమని డాక్టర్ కాళ్ళు పట్టుకున్నాను, కానీ బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఏమి చేయలేము అన్నారు. అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఎక్కడికి వెళుతున్నానో, ఏం చేస్తున్నానో తెలియక అలా సాగిపోయాను. అనూజ కడుపులో ఉన్న బిడ్డని తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. కానీ ప్రాణం లేదు అంటూ అవినాష్ ఎమోషనల్ అయ్యాడు.
అనూజ ఇప్పటికి అర్ధరాత్రి లేచి ఏడుస్తుంది, తొమ్మిదినెలలు మోసి మరొక్క రోజులో బేబీ పుడుతుంది అనుకున్న సమయంలో అలా జరగడం మేము భరించలేకపోయామంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.