ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ మదిలో నడిచేది ఒకటే ప్రశ్న. దేవర చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వదలబోతున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ దేవర కి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడని ఎన్టీఆర్ ఫాన్స్ ధీమాగా ఉన్నప్పటికీ ఇప్పుడు వారిలో ఒకరకమయిన అనుమానం నడుస్తుంది.
అది అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప ద రూల్ నుంచి రీసెంట్ గా విడుదలైన పుష్ప.. పుష్ప.. సాంగ్ ని దేవర ఫస్ట్ సింగిల్ కొడుతుందా అని. పుష్ప మాస్ సాంగ్ కి దేవిశ్రీ ఇచ్చిన మాస్ బీట్ మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అదే మాదిరి దేవర పాట కూడా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుందా.. అసలు దేవర నుంచి ఎన్టీఆర్ - జాన్వీ లపై డ్యూయెట్ వదులుతారా.. లేదంటే ఎన్టీఆర్ పై ఇంట్రడక్షన్ సాంగ్ ఎమన్నా ప్లాన్ చేసారా..
ఏది వదిలినా మాస్ ఆడియన్స్ కి కేకపెట్టించే సాంగ్ అయితే దేవర నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో మ్యూజిక్ కాన్సెర్ట్ ని చేస్తున్న అనిరుద్ అక్కడ కూడా దేవర కి గట్టిగానే హైప్ ఎక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రానున్న దేవర మొదటి సాంగ్ పక్కా మాస్ బీట్ అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరి దేవర సాంగ్ పుష్ప మొదటి పాట ని ఎంతవరకు బీట్ చేస్తుందో అనే ఆత్రుత, కాస్త ఆందోళన రెండూ ఎన్టీఆర్ ఫాన్స్ లో కనిపిస్తున్నాయి. మరో వారం రోజుల్లో దేవర ఫస్ట్ సింగిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా వదలబోతున్నారు మేకర్స్.