Advertisement
Google Ads BL

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విష్ణు మంచు కన్నప్ప టీజర్


విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది వరల్డ్ ఆఫ్ కన్నప్పగా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది.

Advertisement
CJ Advs

ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది. ఇక రెడ్ కార్పెట్ మీద ఈ సినిమా రాక కోసం అందరూ చూస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు తన టీంతో కలిసి తెలుగు చిత్రసీమలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను ఆవిష్కరించబోవటం మాకు చాలా ఆనందంగా ఉంది అని విష్ణు మంచు ట్వీట్ వేశారు. ప్రపంచ ప్రేక్షకులకు మేం ఎంతో ఇష్టంగా రూపొందించిన కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము అని అన్నారు.

ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప కేన్స్ అరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇది గ్లోబల్ సినిమా ల్యాండ్‌స్కేప్‌లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణీయమైన కథనం, అద్భుతమైన చిత్రీకరణ, భారీ తారాగణంతో, అందరికీ ఓ మంచి అనుభూతినిచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు.

Kannappa Set to Shine at Cannes Film Festival :

Vishnu Manchu Epic Kannappa Set to Shine at Cannes Film Festival 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs