పాపం వైసీపీ పార్టీ ఈసారి స్టార్ సపోర్ట్ లేక వెలవెలబోయింది. పవన్ కళ్యాణ్ కి మెగా హీరోలే కాదు, యంగ్ హీరోల సపోర్ట్ కూడా దొరికింది. మెగాస్టార్ అభినులంతా పవన్ వెనుక ఉంటారనడంలో ఈసారి సందేహం పడక్కర్లేదు. దానితో బ్లూ మీడియా ఈకలు పీకినా అర్ధంలేకుండా పోయింది. ఈసారి స్టార్ క్యాంపెయిన్ వైసీపీ బ్యాచ్ కి దూరంగానే ఉంది.
అందుకే చిన్న అవకాశం వచ్చినా వదలకుండా వైసీపీ దానిని వాడేస్తుంది. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ఫ్రెండ్ కి మద్దతుగా నంద్యాల వెళితే అదేదో అల్లు అర్జున్ వైసీపీ కి సపోర్ట్ ఇచ్చినంతగా రచ్చ చేస్తూ అల్లు అర్జున్ ఫోటోలని పబ్లిసిటీకి వాడేసింది వైసీపీ సోషల్ మీడియా. అల్లు అర్జున్ వైసీపీ కి మద్దతునిచ్చాడు.. ఇక అల్లు ఫాన్స్ ఓట్లన్నీ నాకే అన్నారు.
ఈరోజు మే 13 పోలింగ్ డే.. రాజకీయాలకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఓటేయడానికి నిన్న ఆదివారం ముంబై నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈరోజు సోమవారం ఉదయమే ఫ్యామిలీతో కలిసి ఓటేసేందుకు ఎన్టీఆర్ ఓబుల్ రెడ్డి స్కూల్ కి వచ్చాడు. ఎన్టీఆర్ బ్లూ షర్ట్ ధరించి ఓటెయ్యడానికి రావడంతో అదిగో ఎన్టీఆర్ చెప్పకనే చెప్పేసాడు.. వైసీపీకి ఓటేయ్యమని, బ్లూ షర్ట్ తో హింట్ ఇచ్చాడు. ఎన్టీఆర్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడంటూ వైసీపీ సోషల్ మీడియా భజన మొదలు పెట్టింది.
ఇది చూసిన నెటిజెన్స్ ఛీ ఛీ వైసీపీ ఏంటి ఇంతగా దిగజారిపోయి మరీ స్టార్స్ ని వాడుకుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.