శ్రీలీల ప్రస్తుతం సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా కనిపిస్తుంది. కుందనపు బొమ్మ, స్టార్ హీరోలతో సమానంగా డాన్స్ ఇరగదీసే శ్రీలీల ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కి బిగ్ బ్రేకిచ్చింది. వరస వైఫల్యాలు ఇబ్బంది పెడుతున్న సమయంలో శ్రీలీల కెరీర్ లో ఆచి తూచి వ్యవహరిస్తుంది అనే టాక్ ఉంది. మరోపక్క చదువుపై అమ్మడు శ్రద్ద పెట్టింది అంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో తరచూ ట్రెండీ ఫొటోస్ ని షేర్ చేసే శ్రీలీల తాజాగా పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే. బ్లాక్ డ్రెస్ లో స్టయిల్ గా కనిపించింది. లూజ్ హెయిర్ తో కూలింగ్ గ్లాస్సెస్ తో శ్రీలీల అదరగొట్టేసింది. మోడ్రెన్ గానే కాదు గ్లామర్ గా కనిపించింది. శ్రీలీల కొత్త లుక్ చూస్తే యూత్ ఫిదా అవ్వాల్సిందే.
ఇక కేరీర్లో శ్రీలీల పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తుంది. మరోపక్క విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి VD 12 లో ఛాన్స్ కోల్పోయింది అనే టాక్ ఉంది. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలెవరూ శ్రీలీల ని కన్సిడర్ చేయట్లేదు. ఈఫోటో షూట్స్ ఎమన్నా అమ్మడుకి హెల్ప్ అవుతాయేమో చూడాలి.