మూడు వారాల క్రితం హిందీలో గ్రాండ్ గా డెబ్యూ ఇస్తున్న వార్ 2 షూటింగ్ కోసం గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 షూటింగ్ ముంబైలో ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అయితే ఎన్టీఆర్ రెండు వారాల క్రితం ఒక్క రోజు ఫ్యామిలీ తో స్పెండ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చి వెంటనే ముంబై వెళ్ళిపోయారు.
ఆ తర్వాత అక్కడ ముంబై లో డిన్నర్ పార్టీలో భార్యతో కలిసి బాలీవుడ్ సెలెబ్రిటీస్ తో సందడి చేసారు. ఇక రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో కలసి భర్త ఎన్టీఆర్ దగ్గరకి ముంబై వెళ్లారు. ప్రణతి నిన్న ముంబై నుంచి హైదరాబాద్ రాగా.. టైగర్ అదేనండి ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు.
రేపు సోమవారం పోలింగ్ డే కావడంతో తెలంగాణ లో ఓటు హక్కు ఉన్న ఎన్టీఆర్ హైదరాబాద్ కి వచ్చారు. రేవు ఉదయం తల్లి, భార్య తో కలిసి ఆయన జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో తన ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. తాజాగా ఎన్టీఆర్ ముంబై నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.