Advertisement
Google Ads BL

త్రినయని సీరియల్ నటి పవిత్ర మృతి


కన్నడలో పలు సీరియల్స్ లో నటించి తెలుగులోకి త్రినయని సీరియల్ ద్వార బుల్లితెర ప్రేక్షకులకి విలన్ గా దగ్గరైన పవిత్ర జయరాం ఈరోజు ఆదివారం కారు ప్రమాదంలో మరణించడంతో అటు కన్నడ, ఇటు తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

పవిత్ర జయరాం కర్ణాటకలోని తన సొంత గ్రామికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. తెల్లవారుజామున కావడంతో కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీకొట్టి.. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. 

ఈ ప్రమాదంలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే మరణించింది. ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న పవిత్ర బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహచర నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలవగా వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. 

Trinayani serial actress Pavitra Jayaram passed away:

Trinayani serial fame Pavitra Jayaram died in car accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs