ప్రస్తుతం ఏపీకి వెళ్లే వాళ్ళ సంఖ్య చూస్తే వీళ్ళు ఓట్లెయ్యడానికి వెళుతున్నారా.. లేదంటే ఫామిలీస్ తో ఎంజాయ్ చెయ్యడానికి సొంతూళ్లకు వెళుతున్నారా అనే విషయం లో చాలామందికి చాలా అనుమానాలున్నాయి. గత రెండు రోజులుగా విదేశాల నుంచే కాదు.. ఇక్కడ ఏపీ రాష్ట్రానికి వెలుపల ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన, లేదంటే పనుల కోసం వలస వెళ్లిన వాళ్లంతా సొంత ఊరు బాట పట్టారు. హైదరాబాద్ అయితే గత రెండు రోజుల్లో ఆల్మోస్ట్ ఖాళీ. హైదరాబాద్-విజయవాడ హైవేలో ఎక్కడా చూసినా ట్రాఫిక్ జామ్.
బస్ స్టాండ్స్ అయితే కిట కిటలాడుతున్నాయి స్పెషల్ ట్రైన్స్ తో రైల్వే స్టేషన్స్ లో జనాలు నిండిపోయారు. అనుకున్న సమయానికి గమ్యం చేరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, రోడ్లు, సొంత వాహనాలు ఇలా ఎవ్వరూ తగ్గట్లేదు. రెండో శనివారం సెలవు కలిసిరావడం, సంక్రాంతి తర్వాత సొంత ఊర్లకి వెళ్లనివారు, సోమవారం ఓటింగ్ డే హాలిడే ఇలా మూడు రోజులు కలిసి రావడంతో రెండు రోజుల ముందే సొంత ఊళ్ళకి బయలు దేరారు.
నిజంగా వీరంతా ఓట్లు గుద్దితే అనూహ్యంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. మరి ఇంత కష్టపడి సొంత ఊళ్ళకి వెళ్లినవారు ఎండని సైతం లెక్క చెయ్యకుండా ఓటు వెయ్యాలి, కాదు మేము మూడు రోజుల సెలవలని ఎంజాయ్ చెయ్యడానీకి వచ్చాం అంటే అది నిజంగా వారి విజ్ఞతకే వదిలెయ్యాలి. మరి ఏపీ వలస ఓటర్లు ఏం చేస్తారో చూడాలి.