విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత ఏకంగా మూడు చిత్రాలతో బిజీ కాబోతున్నాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 షూటింగ్ కోసం వైజాగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ తన బర్త్ డే రోజున ఏకంగా రెండు పాన్ ఇండియా ఫిలిమ్స్ అనౌన్స్ చేసాడు. అందులో ఒకటి దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన్ అనే మూవీ ని చెయ్యబోతున్నాడు.
ఈ చిత్రం విలేజ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ లో టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తో మరో పాన్ ఇండియా ఫిలిం ని కూడా అనౌన్స్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ డ్యుయెల్ రోల్ చేయబోతున్నాడని, ఇదో పిరియాడిక్ డ్రామాగా ఉండబోతుంది అని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ - రాహుల్ కలయికలో మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నాడని సమాచారం. విజయ్ దేవరకొండ తన కెరీర్ లో ద్విపాత్రాభినయం చేయడం ఇదే మొదటిసారి. మరి తండ్రి కొడుకులుగా విజయ్ దేవరకొండ పెరఫార్మెన్స్ పై ఇప్పుడు రౌడీ ఫాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ మొదలయ్యింది.