కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో సైలెంట్ గా కనిపించిన హీరో నారా రోహిత్.. ఇప్పడు ప్రతినిధి 2 తో సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసాడు. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ ముగించడమే కాదు.. ఎలాంటి హడావిడి లేకుండా ఎన్నికల ముందు ప్రతినిధి 2 అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ప్రమోషన్స్ లేవు, నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాని పట్టించుకోలేదు అన్నారు.
ప్రతినిధి 2 సినిమా గత రాత్రి ప్రెస్ ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చేసుకుంది. నారా రోహిత్ జర్నలిస్ట్ ప్రతినిధిగా మెప్పించాడు, మూర్తి జర్నలిస్ట్ నుంచి డైరెక్టర్ గా మారి పొలిటికల్ థ్రిల్లర్ ను అద్భుతంగా తెరకెక్కించాడు. యాంకర్ ఉదయ్ భాను, అజయ్ ఘోష్ లు తమ పాత్రలకు ప్రాణం పోశారు.
పొలిటికల్ థ్రిల్లర్ లు చూసే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది అంటూ ప్రముఖ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ వైరల్ గా మారడమే కాదు, నారా రోహిత్ యాక్టింగ్, మూర్తి దర్శకత్వం, సెకాండ్ హాఫ్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఇంప్రెస్స్ చేసేవిలా ఉన్నాయంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట.
అయితే ప్రతినిధి 2 లో ఇల్లాజికల్ సీన్స్, నేరేషన్ ఇబ్బంది పెట్టేశాయంటూ కొంతమంది స్పందిస్తున్నారు. మొత్తానికి సైలెంట్ గా షూటింగ్ చేసి, ప్రమోషన్స్ కూడా లైట్ తీసుకున్న నారా రోహిత్.. ప్రతినిధి 2 తో సైలెంట్ గా హిట్ కొట్టేసినట్లే అనిపిస్తుంది.