టాలీవుడ్ కి చందమామ చిత్రంతో చందమామలా పరిచయమైన కాజల్ అగర్వాల్ ఇప్పటికి అదే చందమామ లెక్కన క్యూట్ గా అందంగా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని ఫుల్ స్వింగ్ లో నడిపిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సత్యభామ రిలీజ్ తో పాటుగా క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఇండియన్ 2 కోసం వెయిట్ చేస్తుంది.
ప్రస్తుతం సత్యభామ ప్రమోషన్స్ కోసం రెడీ అవుతున్న కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జస్ట్ కాజల్ అలా చూస్తుంటేనే చాలు ఆమె అభిమానులు మైకంతో పడిపోయేలా ఉన్నారు. అంత చక్కగా బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొట్టేసింది.
తాజాగా కాజల్ ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి హాజరైంది. ఆ ప్రోగ్రాంలో తాను జూనియర్ ఎన్టీఆర్ కోసమే జనతా గ్యారేజ్ లో స్పెషల్ సాంగ్ చేశాను కానీ.. వేరే హీరో ఎవ్వరు అడిగినా చెయ్యను అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి