Advertisement
Google Ads BL

లక్కు తోక తొక్కిన రష్మిక మందన్న


యానిమల్ చిత్రం తో హిందీలో బిగ్గెస్ట్ హిట్ కొట్టి బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్న లక్కు మాములుగా లేదండోయ్. ప్రస్తుతం సౌత్ లో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నిమిషం తీరిక లేని రశ్మికకి ఇప్పుడు బాలీవుడ్ లో మరో బడా ఆఫర్ తగలడం చూసిన వారంతా లక్కు తోక తొక్కిన రష్మిక మందన్న అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా రశ్మిక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్ దక్కుతున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు.

సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నటించేందుకు రశ్మిక మందన్నకు అహ్వానం పలుకుతున్నాం. ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్ పండక్కి తెరపై సల్మాన్, రశ్మిక జంట తెరపైకి వస్తారు. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా దక్కడంపై రశ్మిక మంందన్న ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. నా నెక్ట్ మూవీ అప్డేట్ చెప్పమని ఫ్యాన్స్ తరుచూ అడుగుతుంటారు. సల్మాన్ సరసన సికిందర్ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం పుష్ప 2  షూటింగ్ లో ఉన్న రశ్మిక ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. ఆమె గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. రశ్మిక అందుకుంటున్న అవకాశాలు చూస్తుంటే ప్రస్తుతం ఆమె బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరోయిన్ అనుకోవచ్చు.

Rashmika grabs another pan Indian biggie:

Salman Khan Sikandar: Rashmika Mandanna grabs another pan Indian biggie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs