Advertisement
Google Ads BL

మరో డేట్ మార్చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి


గామీ చిత్రంతో రీసెంట్ గానే సూపర్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్.. మరోసారి ప్రేక్షకులని పలకరించేందుకు రెడీ అయ్యాడు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ విజయాలు ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న విశ్వక్ సేన్ నటించిన మరో భిన్నమైన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో విశ్వక్ లంకల రత్న అనే ఒక బలమైన పాత్రలో కనువిందు చేయనున్నాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమాకి కృష్ణ చైతన్య కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే రెండు మూడు విడుదల తేదీలని అనౌన్స్ చెయ్యడం.. అంతలోనే ఆ తేదీని మార్చుకోవడమనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు కూడా మే 17 న విడుదల అని చెప్పి అంతలోనే రిలీజ్ డేట్ ని మార్చేశారు మేకర్స్. మే 31న ఫలక్‌నుమా దాస్ విడుదలైన తేదీనే  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గత సెంటిమెంట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ పాటుగా విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాపై ఇదే విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. 

Gangs of Godavari to release on 31st May:

Vishwak Sen gutsy Gangster tale Gangs of Godavari to release on 31st May
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs