Advertisement
Google Ads BL

బాబోయ్ రోజాపై రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ


చిన్న ఆర్టిస్ట్ లు అంటూ రోజా జబర్దస్త్ కమెడియన్స్ పై చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికే గెటప్ శ్రీను కౌంటర్ వెయ్యగా.. ఇప్పుడు కిర్రాక్ ఆర్పీ రెచ్చిపోయి రోజని ఓ ఆటాడుకున్నాడు. మనల్ని గౌరవిస్తేనే మనం గౌరవిస్తాం.. అందుకే నేను రోజా అనే పిలుస్తున్నా అంటూ అందుకున్న కిర్రాక్ ఆర్పీ.. రోజా ఏం మాట్లాడింది. మేము చిన్న ఆర్టిస్టులమని, చిన్న ప్రాణాలని రోజా చేసిన కామెంట్స్ చూసా.. ఆది కానీ, మేము కానీ, గెటప్ శ్రీను కానీ, సుధీర్ కానీ ఎంతో కష్టపడి పైకొచ్చాం, మేము చిన్న ఆర్టిస్టులమే, రోజా ఎమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా, ఆమేమన్నా పది నేషనల్ అవార్డ్స్ కొట్టిందా.. వాళ్ళేదో చేసుకుంటున్నారు, వారికి పవన్ కళ్యాణ్ మీద ఇష్టముంది. వారు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ప్రచారం చేసుకుంటుంన్నారు. 

Advertisement
CJ Advs

గెటప్ శ్రీను వేసే కేరెక్టర్ నువ్వు జీవితంలో వెయ్యగలవా.. సుధీర్ మ్యాజిక్ చేసుకుంటూ ఎదిగాడు. సుధీర్ కి మంచి చరిష్మా వచ్చింది. హీరో అయ్యాడు. నువ్వు ఇప్పుడు సుధీర్ తో పోటీ పడగలవా, ఆది లా కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేయగలవా.. ఆది వచ్చాక జబర్దస్త్ వేరే లెవల్ కి వెళ్ళింది. నువ్వు కూర్చుని జెడ్మెంట్ ఇస్తావంతే. ఆది గంటసేపు నించుని నవ్విస్తాడు. 

నిన్ను ఎవ్వరూ ఏమి అన్నపుడు నువ్వెందుకు మాట్లాడతావు. అసలు వైసీపీ లో మొదటిగా ఓడిపోయే సీటు మా యువరాణి రోజమ్మదే. డిపాజిట్లు రావు గుర్తుపెట్టుకో.. ఉలికి పడకు, నీ గురించి మేమెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు, నీకెందుకు మా గురించి. ఏడుగురు హీరోలు జబర్దస్త్ లో ఉంటే.. నీ అన్న దగ్గర డెబ్భైమంది రౌడీలు ఉన్నారు.

నోరుమూసుకుని నీ పబ్లిసిటీ చేసుకో.. నువ్వు కూడా జనసేనలో చేరు నీ బ్రతుకు బావుంటుంది అంటూ రోజాపై రెచ్చిపోయి కిర్రాక్ ఆర్పీ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

RP Sensational Comments on Roja:

Kirrak RP Sensational Comments on Roja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs