రేవంత్ రెడ్డి.. ఈ పేరు, ఈయనకున్న క్రేజ్.. రాజకీయాల్లో ఎదుగుదల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సామాన్య కార్యకర్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే.. Common Man నుంచి Chief Minister అయ్యారన్న మాట. అలాంటి రేవంత్‌కు ఎవరు లిఫ్ట్ ఇచ్చారు..? ఆయన రాజకీయంగా రాణించడానికి ఎవరు చేయూతనందించారు..? అనేది ఒకసారి నెమరువేసుకుంటే.. టక్కున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు. నాటి టీఆర్ఎస్‌కు టాటా చెప్పేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి రేవంత్‌ను బాబు ఎంతలా చూసుకున్నారో.. ప్రత్యేకించి కష్టకాలంలో అండగా ఉంటూ ఆదరించారో తెలుగు ప్రజలందరికీ తెలుసు. రాజకీయాల్లో ఒనమాలు నేర్పించి.. పైపైకి తీసుకొచ్చిన ఘనత బాబుదే. ఒక్క మాటలో చెప్పాలంటే.. రేవంత్‌కు చంద్రబాబు గురువే.. ఇదివ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే.
ఎందుకిలా..?
రాజకీయ గురువును మరిచిన రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ వేదికగా చంద్రబాబుపై ఊహించని వ్యాఖ్యలే చేశారు. అబ్బే.. చంద్రబాబు గురువు కాదని.. ఆయనకు తాను శిష్యుడినీ కాదని.. కేవలం సహచరుడిని మాత్రమేనని తేల్చి చెప్పేశారు. ఎందుకీ సమాధానం వచ్చిందంటే.. శిష్యుడి కోసం చంద్రబాబు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింప చేశారని.. అయితే ఇప్పుడు గురువు ఏపీలో పోటీ చేస్తున్నారు కదా.. శిష్యుడి సహకారం ఏమైనా ఉంటుందా? అనే ప్రశ్న సదరు ఇంటర్వ్యూలో ఎదురైంది. ఈ ప్రశ్నకు అబ్బో.. ఒక్కసారిగా రేవంత్ రెచ్చిపోయారు. ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది.. శిష్యుడు ఎవరు..? గురువు ఎవరు..? తాను సహచరుడిని అని చెప్పాను కదా..! ఎవడన్నా బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే.. ముడ్డి మీద పెట్టి తంతానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడని.. తాను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ పార్టీలోకి పోయానని.. సహచరుడిని మాత్రమేనని చెప్పుకొచ్చారు.
తిట్టేస్తున్నారు..!
అదేదో అంటారే.. తిన్నింటి వాసాలు లెక్కెట్టడం గుర్తుంది కదా సరిగ్గా ఇప్పుడు రేవంత్‌కు సరిపోతుందని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు చంద్రబాబు ఆశీస్సులతో అంతా జరిగిందని.. ఆయన చలువే అని చెప్పుకుని తిరిగిన ఆయన సడన్‌గా ఇలా అనడంతో టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలు.. కొందరు రేవంత్ అభిమానులు సైతం కన్నెర్రజేస్తున్న పరిస్థితి. అయినా ఇలా అనడగానికి రేవంత్‌కు నోరెలా వచ్చిందో అని మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యనే తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గం రేవంత్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం అందరికీ తెలిసిందే. తమ సామాజిక వర్గం అంటే లెక్కలేదా..? ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు..? అంటూ సీఎంను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆయన.. ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అంతేకాదు.. చంద్రబాబు మనిషి అని ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మచ్చను తుడిచేసుకోవడానికి ఇలా లాజిక్‌గా మాట్లాడారనే చర్చ కూడా జరుగుతోంది. ఇవన్నీ కాదు.. చంద్రబాబు రాజకీయ గురువా కాదా అన్నది రేవంత్ మనస్సాక్షికి తెలిస్తే చాలు..!