పవన్ కళ్యాణ్ ఈసారి గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ-బీజేపీ తో పొత్తు పెట్టుకుని కూటమితో కలిసి ఏపీ ప్రజల ముందుకు రావడమే కాదు, పిఠాపురంలో ఈసారి పవన్ ఖచ్చితంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ జాతకాలతో ఈమధ్యన తెగ ఫేమస్ అయిన వేణు స్వామి మాత్రం పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే యోగం లేదు.. చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ కలవడం వల్లే ఇదంతా జరిగింది.
పవన్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని వ్యాఖ్యానించాడు. వచ్చే ఎన్నికల్లో కూటమికి షాక్ తప్పదని, వైఎస్ జగనే విజయం సాధిస్తాడు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. అసలు జాతకరీత్యా చంద్రబాబుది పుష్యమి నక్షత్రమని, పవన్ కల్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రమని, ఈ రెండు నక్షత్రాల పొత్తు కుదరదని.. వీళ్ల జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదని చెప్పిన వేణు స్వామి.. పవన్ కళ్యాణ్ తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని, ఇదంతా జాతకం ప్రకారమే చెబుతున్న అంటూ వేణు స్వామి వివరణ కూడా ఇచ్చాడు.
వేణు స్వామి చెప్పిన పవన్ జాతకం విన్న ఆయన అభిమానులు మండిపడడమే కాదు, వేణు స్వామిని బండ బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వేణు స్వామిని ఏసుకుంటున్నారు.