Advertisement
Google Ads BL

బాబోయ్.. ఈయన చంద్రబాబేనా..!?


40 ఇయర్స్ ఇండస్ట్రీ.. మూడు సార్లు సీఎం.. దేశాన్ని ఏలిన ఎందరో ప్రధానులు, రాష్ట్రపతులను చేశా..!! అవును సర్వం నేనే కనిపెట్టా..? అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకో ఇప్పుడు టూ మచ్ గా తయారయ్యారనే టాక్ ఎక్కడ చూసినా నడుస్తోంది. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకటా రెండా ఎన్ని సార్లు యూటర్నులు.. ఇంకెన్ని సార్లు సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారో లెక్కే లేవు. దీంతో బాబుకు ఏమైందబ్బా..? అని తెలుగు తమ్ముళ్లు ఆలోచనలో పడిన పరిస్థితి.

Advertisement
CJ Advs

బాబోయ్ ఎన్ని ఎన్నెన్ని..?

వలంటీర్లు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, భూ వివాదాలు లేకుండా ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. అమరావతిలో దళితులకు ఇళ్ళ స్థలాలు ఇలా ఎన్నో విషయాలపై అత్యంత దారుణంగా టీడీపీ నేతలు మొదలుకుని అధినేత వరకూ ఎన్నెన్ని మాటలు అన్నారో.. ఇంకెన్ని ఆరోపణలు చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఖరికి ఎన్నికల ముందు అబ్బే అవన్నీ తూచ్.. అన్నీ మేమే చేస్తాం ఓటు వేయండి అని అడుగుతున్న పరిస్థితి. ఎంత సేపూ ఇదిగో అవి ఇవి కంటిన్యూ చేస్తాం అని చెబుతున్నారే తప్ప.. ఇన్నేళ్ళ అనుభవంలో పలానా చేశా ఓటు వేయండి అని చంద్రబాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఇలా..!

జగన్ రెడ్డిని.. సైకో అన్నారు జనం నమ్మలేదు..! బాదుడే బాదుడు అన్నారు జనం నమ్మలేదు..! విధ్వంసం అన్నాడు జనం నమ్మలేదు..! పవన్ తో కలిసారు ధైర్యం చాల్లేదు..! ప్రధాని మోడీని తెచ్చుకున్నారు భయం పోలేదు..! ఎన్నికల ముందు మేనిఫెస్టో వదిలారు.. ప్రజలకు నమ్మకం కలగలేదు..! మీ భూములు దోచేస్తాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నాడు జనం నమ్మలేదు..! ఇప్పుడు ఏకంగా బూతులు తిడుతున్న పరిస్థితి. దీంతో వైసీపీ శ్రేణులు చంద్రబాబును దుమ్మెత్తి పోస్తున్నారు. ఆఖరి అవకాశం.. చేజారిపోతుందనే నిరాశ నిస్పృహ చంద్రబాబు వ్యవహారంలో స్పష్టంగా తెలుస్తోంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

పచ్చి బూతులు!!

జగన్ రెడ్డిని అనకూడని.. అనాల్సిన మాటలు అన్నీ అనేసిన చంద్రబాబు ఆఖరికి.. అమ్మ నా బూతులు తిడుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బాబు. జగన్ అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, ముత్తాతను సైతం ఎంచుతున్నారంటే అసలు బాబు అనుభవం, వయసు ఏమైంది..? ఏంటో..! ఈ వ్యాఖ్యలకు గాను ఆఖరికి జగన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసేదాకా తెచ్చుకున్నారు చంద్రబాబు.

ఐతే బూతులు తిట్టడంలో వైసీపీ ఏమీ తక్కువ తినలేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ నోరు తెరిస్తే ఎలాంటి మాటలు వస్తాయో తెలియంది ఏమీ కాదు. చంద్రబాబు కూడా ఇంత దిగజారి మాట్లాడాలా..? అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇంకో నాలుగైదు రోజులు ఎన్నికలు ఉండటంతో ఇంకా ఏమేమి అంటారో.. వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి..!

Baboy.. is he Chandrababu..!?:

Chandrababu Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs