హమ్మయ్య జూన్ లో ఇండియన్ 2 విడుదలవుతుంది, ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చరణ్, దిల్ రాజు చెప్పినట్టుగానే సెప్టెంబర్ కానీ అక్టోబర్ లో కానీ గేమ్ ఛేంజర్ విడుదల ఉంటుంది అని మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇండియన్ 2 వాయిదా వార్తలు వాళ్ళని మళ్ళీ ఆందోళనలో పడేశాయి.
ఇండియన్ 2 వాయిదా పడితే ఆటోమాటిక్ గా గేమ్ చెంజర్ విడుదల కూడా లేటవుతుంది అంటూ స్టిల్ ఇప్పటివరకు మెగా ఫాన్స్ టెన్షన్ లోనే కనిపిస్తున్నారు. కానీ తాజాగా మెగా ఫాన్స్ టెన్షన్ ఫ్రీ అయ్యే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కమల్ హాసన్-శంకర్ కలయికలో తెరకెక్కిన ఇండియన్ 2 జూన్ లో పోస్ట్ పోన్ చేసినా.. జులై 18 న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున కోలీవుడ్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.
జస్ట్ ఒక్క నెల పోస్ట్ పోన్ తో ఇండియన్ 2 ఆడియెన్స్ ముందుకు వచ్చేస్తుంది. సో గేమ్ చెంజర్ విడుదలకి ఇండియన్ 2 వలన ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు. అందుకే మెగా ఫాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. లేదంటే శంకర్ ఇండియన్ 2 ని గేమ్ చెంజర్ ని ముడిపెట్టి అడుగడుగునా మెగా ఫాన్స్ ని నిరాశపరుస్తుంటే.. ఇప్పుడు కూడా ఇండియన్ 2 వల్ల గేమ్ చెంజర్ డేట్ మారిపోయిద్దేమో అని వారు ఆందోళన పడని నిమిషం లేదు.. సో ఇప్పుడు ఆ టెన్షన్ లేదు!