Advertisement
Google Ads BL

కష్టమే కవిత.. మరో బిగ్ షాక్!!


కవితకు తప్పని షాక్‌లు.. ఇప్పట్లో కష్టమే!

Advertisement
CJ Advs

దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వరుస షాక్‌లు తప్పట్లేదు. అలా బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం.. ఇలా కోర్టులు తిరస్కరించడం సరిపోతోంది. తెలంగాణ కీలకంగా ఉన్న ఎన్నికల్లో చివరి రోజైనా ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు ఎంతగానో ఆశపడ్డాయి. అయితే కవితకు ఆ భాగ్యం లేకుండా పోయింది. ఎందుకంటే.. తనకు బెయిల్ ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టు అయిన రౌస్ అవెన్యూలో దరఖాస్తు చేసుకోగా.. బెయిల్ ఇవ్వడానికి కుదరదని న్యాయస్థానం తేల్చేసింది. దీంతో మరోసారి కవితకు చుక్కెదురు అయినట్టయ్యింది. అంతేకాదు.. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను సైతం ట్రయల్ కోర్టు కొట్టేసింది. న్యాయమూర్తి కావేరి బవేజా ఈ తీర్పును వెల్లడించారు.

గట్టి దెబ్బే!!

అంటే.. మరికొన్నిరోజులు కవిత తీహార్ జైలులోనే ఉండునున్నారు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని.. ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే.. కవితను కొద్దిరోజుల పాటు టీవీల్లో చూడటమే తప్ప.. నేరుగా చూసే భాగ్యం తమకు లేదని అభిమానులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటితో (మే-07) కస్టడీ ముగియనుండటంతో ఈడీ, సీబీఐ అధికారులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కోర్టు మళ్లీ ఎన్నిరోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది..? దర్యాప్తు సంస్థలు ఎన్నిరోజులు కస్టడీకి ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందన్నది తెలియాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అరెస్టయిన కవిత.. ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా దూరంగా ఉండటంతో ఇది పార్టీకి పెద్ద మైనస్‌గానే మారిందనే టాక్ తెలంగాణలో గట్టిగానే నడుస్తోంది.

Kavita is difficult.. another big shock!!:

Court refuses to grant bail to BRS MLC Kavitha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs